కట్నం గురించి కిరాక్ ఆర్పీ భార్య షాకింగ్ కామెంట్స్.. రూపాయి కూడా తీసుకోలేదంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచే అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పి ఆ తర్వాత పలు షోలలో కూడా కామెడీ చేస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Kiraak Rp Wife Lakshmi Prasanna Latest Interview Highlights , Kiraak Rp, Lakshmi-TeluguStop.com

కాగా నాగబాబు పేరును తన గుండెల పై పచ్చబొట్టు పొడిగించుకున్న విషయాన్ని షోలో స్టేజ్ పై అందరి ముందు చూపిస్తూ ఆ విషయాన్ని బయట పెట్టిన కిరాక్ ఆర్పి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది.ప్రపంచంలో ఇలాంటి దరిద్రమైన ప్రొడక్షన్ హౌస్ ఉండదని.

మల్లెమాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు ఆర్పీ.కాగా ఇటీవలే ఆర్పీ కి లక్ష్మీ ప్రసన్న అనే ఒక అమ్మాయి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

చాలా సంవత్సరాలుగా ఆమెని ప్రేమిస్తున్న ఆర్పి ఎట్టకేలకు ఆమె ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.అంతేకాకుండా త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది.

ఇది ఇలాంటి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట కట్నం తీసుకునే వాడు వెధవ అంటూ తమ అభిప్రాయాలను తెలియజేశారు.కిర్రాక్ ఆర్పీ.మా ఇన్‌స్టిట్యూట్‌కి గెస్ట్‌గా వచ్చారు.అప్పుడు నన్ను చూసి.

నెంబర్ అడిగితే నేను మా అమ్మ నెంబర్ ఇచ్చాను.అప్పటి నుంచి తగులుకున్నాడు.ఏడాది వరకూ మా అమ్మతోనే మాట్లాడారు.వాళ్లిద్దరూ బాగా బాండింగ్ ఏర్పరచుకున్నారు.ఏడాది తరువాత నేను మాట్లాడాను.మా ఫ్యామిలీకి ముందు దగ్గరై ఆ తరువాత నాకు దగ్గరయ్యాడు.

అయితే కొన్నాళ్ల పాటు సినిమా వాళ్లు అంటే ఇలా ఉంటారు ఇలా ఉంటారని ఒప్పుకోలేదు.రెండేళ్లు పాటు మా వాళ్లని అడిగిఅడిగి చివరికి ఒప్పించాడు.మా అమ్మ ఒప్పుకోకపోయే సరికి మా బంధువుల్ని ఒక్కొక్కర్నీ ఒప్పించడం మొదలుపెట్టాడు.మా బంధువులు అందర్నీ ఒప్పించేసరికి రెండేళ్లు పట్టిందని చెప్పింది ఆర్పీతో లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న.

ఇక ఆర్పీ కట్నం గురించి.ఘనంగా జరిగిన తన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ.

మా ఎంగేజ్ మెంట్ కూడా అంత ఘనంగా జరిపించానంటే అది నాకు కాబోయే భార్య ఫ్యామిలీ కోసమే.అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

Telugu Dowry, Jabardasth Show, Kiraak Rp, Love Story Rp, Naga Babu, Tollywood-Mo

అమ్మాయి వాళ్లు సగం డబ్బులు పెట్టుకుంటామూ అని చెప్పినా నేను అందుకు ఒప్పుకోలేదు.నాకు కట్నంగా ఓ ఫ్లాట్ తీసుకుంటానని అన్నారు కానీ.నాకు ఫ్లాట్ వద్దూ ఏమీ వద్దు.నా దృష్టిలో ఒక అమ్మాయి దగ్గర కట్నం తీసుకునే వాడంత వెధవ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండదు.అమ్మాయి డబ్బులు తీసుకుని వస్తే ఆ డబ్బుతో బతికేవాడు నాకు ఇష్టం ఉండదు.నాకు కట్నం అన్నా.

కానుకలు అన్నా ఇష్టం ఉండదు అంటూ కిరాక్ ఆర్పీ తనకి కాబోయే భార్య ముందు చాలానే గొప్పలు చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube