Sri Divya : పెళ్లి చేసుకోబోతున్న కేరింత మూవీ హీరోయిన్.. అబ్బాయి ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఒకరి తర్వాత ఒకరు తాము ప్రేమించిన లేదా ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు.క తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ( Varun tej Lavanya tripathi ) లు మరికొద్ది గంటల్లో పెళ్లితో ఒక్కటవబోతున్నారు.

 Kerintha Movie Heroine Sri Divya Who Is Going To Get Married Who Is The Boy-TeluguStop.com

అలాగే నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకుంది.అలాగే ఆ మధ్యకాలంలో శర్వానంద్, ఇక త్వరలోనే మిల్కీ బ్యూటీ తమన్నా ఇలా ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.

అయితే తాజాగా మరో తెలుగు హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయింది అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వార్త వినిపిస్తోంది.

Telugu Bus, Hanuman, Kerintha, Mahesh Babu, Manasara, Marraige, Sri Divya, Tolly

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీ దివ్య( Sri Divya ).నటి శ్రీదివ్య మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు అలాగే హనుమాన్ జంక్షన్,వీడే వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.అలా కొన్ని సినిమాల్లో బాలనాటిగా చేసి ఆ తర్వాత బస్ స్టాప్,కేరింత, మనసారా, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు వంటి తెలుగు సినిమాల్లో చేసింది.

అంతేకాకుండా తమిళంలో కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bus, Hanuman, Kerintha, Mahesh Babu, Manasara, Marraige, Sri Divya, Tolly

అయితే స్వయంగా ఈ విషయాన్ని శ్రీదివ్య ( Sri Divya ) ఓ ఇంటర్వ్యూలో భాగంగా బయట పెట్టింది.శ్రీదివ్య నటించిన తాజా సినిమా రైడ్( Ride ) ..వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదివ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆమెను ఓ రిపోర్టర్ నేరుగా పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.దానికి శ్రీదివ్య స్పందిస్తూ.

నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను.అలాగే ప్రేమించిన నా ప్రియుడినే నేను పెళ్లాడబోతున్నాను అని క్లారిటీ ఇచ్చింది.

ఇక శ్రీదివ్య స్వయంగా తన లవర్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతేకాదు శ్రీ దివ్య ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరబ్బా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరాతీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube