టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కాగాప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి ఒకరు.మొదట నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి సినిమాతో ( Mahanati )రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ఆ మూవీలో సావిత్రి పాత్రలో తన అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డ్ అందుకుంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించింది.నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ తారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.కాగా ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారన్న విషయం మనందరికి తెలిసిందే.ఇక కీర్తి సురేష్ ప్రస్తుత నికర విలువ రూ.41 కోట్లు.అంతే కాకుండా నెలకు దాదాపు 35 లక్షల రూపాయలు సంపాదిస్తోంది.కీర్తి ఏడాదికి రూ.4 కోట్ల ఆదాయం వస్తుంది.సినిమాలు, టెలివిజన్స్, యాడ్స్ నుంచి సంపాదిస్తోంది.
కీర్తి సురేష్( Keerthy suresh ) ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది.
సినిమాల్లోనే కాకుండా కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తోంది.ఆ విధంగా కీర్తి సురేష్ యాడ్ ఫిల్మ్‌ల కాంట్రాక్ట్ కోసం దాదాపు రూ.31 లక్షలు సంపాదించింది.ప్రముఖ కార్పొరేట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. కీర్తి సురేష్( Keerthy suresh ) తన సోషల్ మీడియా పేజీలో ప్రచారం చేయడానికి 25 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఆమె ఆస్తిపాస్తి విషయానికి వస్తే.ఇప్పటివరకు ఆమె చాలా కార్లను ట్రై చేసింది.ప్రస్తుతం తన వద్ద రూ.60 లక్షల విలువైన వోల్వో 690, రూ.1.38 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ 730 ఎల్‌డి, రూ.81 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, రూ.25 లక్షల విలువైన టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి అనేక కార్లు ఉన్నాయి.