టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Maharaja Ravi Teja ) నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.
ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా సినిమా దర్శకుడు వంశీకృష్ణ( Director Vamsi Krishna ) మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు బయట పెట్టారు.ఈ సినిమా కథ చెప్పినపుడు రవితేజ రియాక్షన్ ఏమిటి.

అని అడిగితే రవితేజ మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు, షూటింగ్ ఉంది.మిగతాది రేపు వింటానని చెప్పడంతో ఇంక కాల్ రాదేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన సమయానికి ఫోన్ చేశారు.వెళ్లి కథ చెప్పాను అని తెలిపారు.క్లైమాక్స్ చెబుతుండగానే ఆయన లేచి జుట్టు ఇలా పెంచితే బావుటుందా? ఇలా లెన్స్ పెట్టుకోనా ? అని అడుగుతూ ఉండడంతో ఆయన ఆల్రెడీ కథని ఓకే చేసి ముందుకు వెళ్ళిపోయారని అర్ధమై నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిదని అన్నారు వంశీకృష్ణ.అది చాలా ఎమోషనల్ మూమెంట్ అని ఆయన చెప్పుకొచ్చారు.

మీ కెరీర్ లో బడ్జెట్, స్టార్స్ ప్రకారం ఇది చాలా భారీ సినిమా కదా ? ఒత్తిడి ఫీలయ్యారా? అని అడిగితే లార్జ్ స్కేల్ సినిమాలలో హీరో, నిర్మాత అంత బలంగా నమ్మిన తర్వాత అంత ఒత్తిడి ఉండదని, రవితేజ చాలా కేర్ తీసుకున్నారని అన్నారు.ఇందులో చాలా మంచి నటులను తీసుకున్నాము.అలాగే హరీష్, జీషు చాలా కొత్తగా కనిపిస్తారు.
అందరూ సొంత సబ్జెక్ట్ లా నమ్మి చేశారు అని ఆయన చెప్పు కొచ్చారు.ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఎక్కడా రాజీపడకూడదని ముందే అనుకున్నాం అని అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావించాను అని తెలిపారు వంశీకృష్ణ.
మూవీలో హీరోయిన్ నుపూర్( Nupur ) పాత్ర గురించి చెబుతూ దొంగతనాలు చేసిన బంగారాన్ని అమ్మడానికి ఒక చోటు కావాలని అందుకే ఆ బెల్ట్ లోకి చాలా మంది మార్వాడీలు వచ్చారు.అలా ఓ మార్వాడీ అమ్మాయితో టైగర్ నాగేశ్వరరావు కి అనుబంధం ఏర్పడుతుందని అదే నుపూర్ పాత్ర అని చెప్పుకొచ్చారు దర్శకుడు వంశీకృష్ణ.







