జీఎస్టీ కొత్త ప్రతిపాదనపై నిర్ణయం మార్చుకోండి: కేసీఆర్

కేంద్రం జీఎస్టీ లోటును రాష్ట్రాలు భర్తీ చేయాలని ప్రతిపాదినలపై కొన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

 Telangana Cm Kcr Letter To Pm Modi On Gst Dues, Gst Dues, Cm Kcr, Modi, Gst Cou-TeluguStop.com

జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అన్నీ నిర్ణయాలు కేంద్రానికి అనుకూలంగా తీసుకున్నారని మండిపడ్డారు.ప్రతిపాదనలపై మరోమారు పునరాలోచించాలని సూచించారు.

రాష్ట్రాల నుంచి అన్ని వేల కోట్లు తీసుకోవడం సరికాదన్నారు.

లేఖలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.

‘‘ జీఎస్టీ కొత్త ప్రతిపాదన వల్ల రాష్ట్రాలు నష్టాల్లో కూరుకుపోతాయి.ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా కూరుకుపోయింది.

రుణాలపై ఆంక్షలు విధించడం సరైంది కాదు.ఈ ప్రతిపాదన ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం.

ఆర్థికంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.కేంద్రమే జీఎస్టీ బకాయిలు చెల్లించాలి.

కేంద్రం ఆర్బీఐ నుంచి రుణం తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం అందించాలి.జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని తెలిసినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లును సమర్థించాం.

మొట్టమొదటి సారిగా బిల్లును ఆమోదించడానికి అసెంబ్లీలో తీర్మానించాం.ఇప్పుడు తీసుకున్న కొత్త జీఎస్టీ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి.

జీఎస్టీని రద్దు చేసే సమయంలో కేంద్రం పూర్తి పరిహారాన్ని అందజేస్తామని చెప్పింది.ప్రతి రెండు నెలలకు ఒకసారి రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి జీఎస్టీ పరిహారం చెల్లించాలి.

’’ అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube