ఒకవైపు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకు వస్తున్నా, కేసీఆర్ ( KCR )మాత్రం పెద్దగా కంగారు పడటం లేదు .తన ఫోకస్ అంతా మహారాష్ట్ర ఎన్నికలపై అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ తరఫున మూడు భారీ బహిరంగ సభలను కెసిఆర్ నిర్వహించారు.మహారాష్ట్రలో పట్టు సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
మహారాష్ట్ర, తెలంగాణలో( Maharashtra , Telangana ) కలిపి మొత్తం 65 లోక్ సభ స్థానాలు ఉండగా ,అందులో మెజార్టీ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే కేంద్రంలో తమకు తిరుగు ఉండదనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారు .కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ మద్దతు కీలకం అవుతుందని అంచనా వేస్తున్నారు.అందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలపై మరింతగా ఫోకస్ పెట్టారు.మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండడంతో , అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

పెద్ద ఎత్తున ఇతర పార్టీలోని నేతలను చేర్చుకుంటూ మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తున్నారు.తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి( Solapur Constituency ) చెందిన కొంతమంది సర్పంచులు నిన్న తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రతో పాటు , భారతదేశం అభివృద్ధి జరగడం లేదని, అంబానీ ఆదాని ల ప్రభుత్వం కాదు, రైతులు పేదల అభివృద్ధి లక్ష్యంగా దేశంలో రైతు ప్రభుత్వం రావాలని కేసిఆర్ ఆకాంక్షించారు.
రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బిఆర్ఎస్( Brs) లక్ష్యమని అందుకే ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని వినిపిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు.
దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక గాలి వీస్తోంది అని, ప్రజల్లో కేంద్రం తీరుపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని , అవన్నీ తమకు కలిసి వస్తాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

అలాగే కాంగ్రెస్ కు సైతం పెద్దగా అవకాశం ఉండదని, ప్రత్యామ్నాయం వైపు ప్రజల దృష్టి ఉందని అంచనా వేస్తున్నారు.అందుకే తెలంగాణ, మహారాష్ట్రలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ అక్కడ వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు.కేంద్రంలో కీ రోల్ పోషించేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
అందుకే గత కొంతకాలంగా కేంద్రంపై కేసీఆర్ దూకుడు పెంచారు.