దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది వివిధ సందర్భాలలో వారికి ఉన్న దేశభక్తి( Patriotism )ని చాటుకుంటూ ఉంటారు.చిన్న పెద్ద అని తేడా లేకుండా వారిలో ఉన్న దేశభక్తిని వివిధ రకాలుగా చాటుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవము( Independence Day ) గణతంత్ర దినోత్సవం సమయంలో ఈ విధంగా వాడుకున్న దేశభక్తిని ఒక్కొక్క విధంగా చాటి చెబుతూ ఉంటారు.గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
తాజాగా ఒక రైతు కూడా దేశభక్తిని చాటుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.

కరీంనగర్ జిల్లాకు చెందిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అయిన మల్లికార్జున్ రెడ్డి( ICRA Award Farmer Mallikarjun Reddy ) తాజాగా దేశభక్తిని చాటుకున్నాడు.ఈ క్రమంలోనే తన పొలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాడు.వరి నాట్ల సహాయం( Paddy Field )తో దేశ పటాన్ని తన పొలంలో చిత్రీకరించాడు.20 గుంటల విస్తీర్ణంలో దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటాడు.అంతేకాకుండా నేటి నుంచి ఏడాది పొడవునా అనగా ప్రతిరోజు జాతీయ గీతం పాడడంతో పాటుగా ఉదయం సమయంలో జెండాను ఆవిష్కరించి సాయంత్రం సమయంలో వితరణ చేయనున్నట్లు సదరు రైతు తెలిపారు.

ఇకపోతే ఇప్పటికే మల్లికార్జున్ రెడ్డి వ్యవసాయంలో ఉత్తమ ప్రతిభను కనబరిచి అద్భుతమైన ఫలితాలతో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.అదే స్ఫూర్తితోనే మరొకసారి అందరిలో ఒకరిగా నిలవాలని 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు తన దేశభక్తిని చాటాడు.కాగా తన పొలంలో చిత్రీకరించిన దేశ పటం( India Map ) ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.
సదరు రైతు చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







