టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాలకు ఆదరణ భారీగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే.దీనికి సరైన ఉదాహరణగా సావిత్రి బయోపిక్ ‘మహానటి’ నిలుస్తుంది.
ఇక ఈ కోవలో పలు బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.కాగా తాజాగా మరో బయోపిక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణీ కర్ణం మల్లీశ్వరి జీవిత కథను బయోపిక్ మూవీగా తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతుండగా ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు ఓ యంగ్ లేడీ డైరెక్టర్‌ను ఆయన ఓకే చేసినట్లు తెలుస్తోంది.రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన సంజనా రెడ్డి ఈ బయోపిక్ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
1995 ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని అందించిన కర్ణం మల్లీశ్వరి గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అవసరం లేదు.శ్రీకాకుళంలోని ఆముదాలవలసకు చెందిన కర్ణం మల్లీ్శ్వరి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి దేశ కీర్తిని అంతర్జాతీయంగా చాటింది.మరి ఆమె బయోపిక్ చిత్రంలో నటించే నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది.