దీపావళి వేడుకలు : చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కమలా హారిస్

దివ్వెల పండుగ దీపావళిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోయారు.

 Kamala Harris Recollects Fond Memories Of Diwali Celebrations In India , Kamala-TeluguStop.com

ప్రత్యేక పూజలు, బాణాసంచా కాల్పులు, దీపాల కాంతులతో ప్రతి ఇల్లూ పులకించిపోయింది.ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో మునుపెన్నడూ లేని విధంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బైడెన్ దంపతులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా ప్రభుత్వంలోని పలువురు ఇండో అమెరికన్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బైడెన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

అటు దీపావళి సందర్భంగా కమలా హారిస్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

తన తల్లి అంకితభావం, సంకల్పం, ధైర్యమే తన విజయానికి కారణమని ఆమె తెలిపారు.చిన్నప్పుడు తరచూ చెన్నైకి వెళ్లడం, తాతగారి కుటుంబంతో కలిసి దీపావళిని జరుపుకోవడాన్ని కమలా హారిస్ గుర్తుచేసుకున్నారు.

చీకటిలో కాంతి రేఖను చూడటమే దీపావళి వెనుక ముఖ్యోద్ధేశమని ఆమె అన్నారు.

Telugu America, Crackers, Diwali, India, Jil Biden, Joe Biden, Kamala Harris, Pa

ఇకపోతే… దీపావళిని పురస్కరించుకుని గత శుక్రవారం కమలా హారిస్ తన నివాసాన్ని అందంగా ముస్తాబుచేశారు.మట్టిప్రమిదల దీపాలతో పాటు రంగు రంగుల విద్యుద్దీపాలతో ఆమె అధికారిక నివాసం కాంతులీనుతోంది.ఈ దీపావళి వేడుకల్లో భారతీయ అమెరికన్ ప్రముఖులు, దౌత్యవేత్తలు , ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అతిథులకు భారతీయుల ఫేవరేట్ పానీపూరి నుంచి సాంప్రదాయ స్వీట్లను వడ్డించారు.ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ… దీపావళి అనేది సంస్కృతులకు అతీతమైన విశ్వవ్యాప్త భావన అన్నారు.

చీకటిలో వెలుగును ప్రసరింపజేయడం అనే ప్రేరణ పొందేందుకు దివాళిని జరుపుకుంటారని ఆమె చెప్పారు.అనంతరం అందరికీ దీపావళి శుభాకంక్షలు తెలిపి.

క్రాకర్స్ కాల్చారు కమలా హారిస్ దంపతులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube