తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషలలో కూడా అవకాశాలు అందుకుని ఎంతోమంది సక్సెస్ అయ్యారు.
ఇండస్ట్రీలో కెరియర్ పరంగా దూసుకుపోతున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని రెండు సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన నూతన గృహప్రవేశానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు.దీనితో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
తన భర్త కుమారుడు( Neil Kitchlu )తో కలిసి పూజ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఫోటోలను కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా తాము గృహప్రవేశం( Kajal Aggarwal Griha Pravesh ) చేసామని తెలియజేస్తూనే ఈ గృహప్రవేశ పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలను ఈమె అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ కొత్త ఇంట్లో మీకు అన్ని శుభాలు జరగాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే ఈమె శంకర్ దశకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 ( Indian 2 ) నటించారు.అలాగే సత్యభామ అనే లేడి ఓరియంటెడ్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.