ఆ 'కిస్' వట్టి గ్రాఫిక్సే అని చెబితే ఎవరూ నమ్మలేదు: కాజల్

అందాల ‘చందమామ’ కాజల్ అంటే తెలియని తెలుగువారు ఉండరంటే నమ్మితీరాల్సిందే.తెలుగు తెరపై తన అందచందాలతో పాటు, చక్కని అభినయాన్ని కనబరిచే కాజల్ అంటే అందరికీ మక్కువ ఎక్కువే‌.

 Kajal Aggarwal On Brothers Movie Kissing Scene, Brothers Movie Scenes, Hero Suri-TeluguStop.com

ఈమెను డైరెక్టర్స్ హీరోయిన్ అని అందరూ అంటూ ఉంటారు.ఎందుకో తెలుసా.? ఆమె అందరిలా సినిమా అయిపోయిన వెంటనే సదరు టెక్నీషియన్లను మర్చిపోదు.అప్పుడప్పుడు టచ్ లో ఉంటుంది.

మంచి చెడులలో వారిని పలకరిస్తూ ఉంటుంది.
ఈ విషయం మరెవరో కాదు.

స్వయంగా డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇంచుమించు 50కి పైగా సినిమాల్లో నటించిన కాజల్, అరుదుగా లిప్‌ లాక్‌ సన్నివేశాలలో కూడా అలరించింది.

ఇందులో చెప్పుకోదగ్గవి ఒకటి హీరో మహేష్ తో చేసిన బిజినెస్ మెన్, రెండు తమిళ స్టార్‌ హీరో సూర్యతో చేసిన ‘బ్రదర్స్‌’ ఒకటి.ఇందులో మహేష్ తో చేసిన కిస్ షాట్స్ మాత్రం రియల్ గానే చేశారు.

అయితే, బ్రదర్స్ లో కాజల్‌కు సూర్య కు మధ్య థియేటర్లో ఓ చక్కటి లిప్‌లాక్‌ సీన్‌ ఉంటుంది.

ఇక ఈ సన్నివేశానికి సంబంధించి తాజాగా కాజల్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది‌.వాస్తవానికి ఆ సన్నివేశంలో సూర్య కాజల్‌ను నిజంగా ముద్దు పెట్టుకోలేదట.అది గ్రాఫిక్స్‌ తో తయారు చేసిన లిప్‌ లాక్ అని, డైరెక్టర్ ఆనంద్ ఆ సీన్‌ను ఓ గమ్మత్తైన పద్ధతిలో తెరకెక్కించారని చెప్పింది.

దీన్ని బ్లూ మ్యాట్‌ సహాయంతో ఎంతో అవలీలగా తీసేశారని పేర్కొంది.కానీ ఆ సీన్ ను చుస్తే మాత్రం రియల్ గా తీశారనే అనిపిస్తుంది.అందుకే అది గ్రాఫిక్స్ అని చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో కాజల్ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube