జ్యోతి రాయ్ ( Jyothi Rai ) కంటే జగతి మేడం అంటేనే టక్కున అందరికీ ఈమె గుర్తుకొస్తారు.గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి జగతి ( Jagathi ) అసలు పేరు జ్యోతి రాయ్.
ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ సీరియల్ లోకి అడుగుపెట్టారు అయితే ఈమె ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక ఈమె ఇది వరకే పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చి తనకు విడాకులు ఇచ్చారని అయితే తనకంటే వయసులో చిన్నవాడైనటువంటి డైరెక్టర్ సుఖ్ పూర్వజ్ ( Sukh Purvaj ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసు కానీ పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని ఎక్కడ వెల్లడించలేదు కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుని చాలా కాలమైందని తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇక తన భర్త పూర్వజ్ పుట్టినరోజు( Birthday ) కావడంతో ఈమె తనతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.మనం కలిసి ఏడాది అయింది.నా జీవితం మొత్తం మారిపోయింది.ప్రస్తుతం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను.నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్ మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికి థాంక్స్.నీ సహనం.
నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్.నీ వల్ల నా జీవితం సంపూర్ణమైంది నీలాంటి వ్యక్తి భర్తగా రావటం నా అదృష్టం.
హ్యాపీ బర్త్ డే డార్లింగ్.లవ్యూ అన్ కండీషనల్లీ అంటూ జ్యోతి రాయ్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.