ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న కంది పంట( Pigeonpea Crop ) ప్రస్తుతం పూత దశలో ఉంది.ఈ దశలో కంది పంటకు చీడపీడల బెడద( Pests ) కాస్త ఎక్కువ.
ముఖ్యంగా శనగపచ్చ పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంది.ఈ పురుగులను పొలంలో గుర్తించి తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి.
ఒకవేళ ఆలస్యం చేస్తే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.కంది మొక్కల మధ్య కాస్త అధిక దూరం ఉంటే ఈ పురుగుల వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
శనగపచ్చ పురుగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.ముఖ్యంగా కంది పంట వేసే ముందు పొలంలో ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏవైనా ఉంటే పూర్తిగా శుభ్రం చేసి లోతు దుక్కులు దున్నుకోవాలి.
ఇలా చేస్తే చీడపీడల తెగుళ్ల బెడద కాస్త తక్కువగా ఉంటుంది.కంది పంటలో బంతి పంటను ఎరపంటగా వేయాలి.
అంతేకాదు కందిలో మొక్కజొన్న పంటను కూడా అంతర పంటగా సాగు చేస్తే అధిక దిగుబడులు( High Yielding ) సాధించే అవకాశం ఉంటుంది.చీడపీడల నివారణకు రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.ఒక ఎకరం పొలంలో నాలుగు లింగాకర్షక బుట్టలు, 8 నుంచి 10 వరకు పక్షిస్తావరాలు ఏర్పాటు చేయాలి.చీడపీడల బెడద తక్కువగా ఉంటే.ఐదు శాతం వేపగింజ కషాయం లేదంటే
ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను( Neem Oil ) పూత, ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.ఒకవేళ చీడపీడల బెడద అధికంగా ఉంటే 1.5 గ్రాముల ఎసిఫెట్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే 1.5గ్రా థయోడికార్స్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇంకా పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే 0.3 మి.లీ స్పైనోశాడ్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.