#RRR చజిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచం నలుమూలల ఎలా పాకిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్( JR NTR ) గొప్ప నటుడు అని మన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకి మాత్రమే తెలుసు.
కానీ #RRR చిత్రం ద్వారా ఆయన ఎలాంటి నటుడో ప్రపంచం మొత్తం చూసింది.అందుకే ఆయన తదుపరి చిత్రాలకు ఇప్పటి నుండే డిమాండ్ విపరీతంగా ఏర్పడింది.
ప్రస్తుతం కొరతలో శివ తో దేవర అనే చిత్రం లో నటిస్తున్న ఎన్టీఆర్, ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ చెయ్యబోతున్నాడు.ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తాడు.
అయితే ఎన్టీఆర్ వార్ 2( War 2 ) లో నెగటివ్ రోల్ ద్వారా కనిపించబోతున్నాడని టాక్.టెర్రరిస్ట్ నాయకుడిగా ఇండియా ని గడగడలాడించే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు అట.
అయితే ‘వార్ 2 ‘ కంటే ముందుగా , జూనియర్ ఎన్టీఆర్ ‘టైగర్ 3( Tiger 3 ) ‘ చిత్రం లో నటించబోతున్నాడు అట.సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది అట.ఈ సినిమాకి కొనసాగింపుగా ‘వార్ 2 ‘ ఉంటుందని సమాచారం.ఈ సినిమా షూటింగ్ డిసెంబర్, లేదా జనవరి నుండి ఉంటుందని సమాచారం.
సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా, అది కూడా ‘టైగర్’ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.ఇంతకు మించి గొప్ప రీచ్ మరొకటి ఉండదు.
ఈ సినిమా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కి బాలీవుడ్ లో బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు.రాబొయ్యే రోజుల్లో ఎన్టీఆర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని శాసిస్తాడు అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం చేస్తున్న దేవర చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఇప్పటికే ఆరు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు యాక్షన్ బ్లాక్స్ గ్రాఫిక్స్ వర్క్స్ ని జరుపుకుంటుంది.వచ్చే నెల లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రేంజ్ విజువల్స్ తో ఈ యాక్షన్ సన్నివేశాలను రూపొందించినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఆచార్య ఫ్లాప్ తో డీలాపడిన కొరటాల శివ, ఎలా అయినా ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని పాన్ ఇండియా వైడ్ లో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు అట.చూడాలి మరి కొరటాల శివ లో ఎంత సత్తా ఉంది అనేది.