యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు.ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ప్రకటించి రెండేళ్లు గడుస్తున్న ఈ సినిమా ఏదొక కారణంతో ఆగిపోతూనే ఉంది.
ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని నందమురి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ప్రెజెంట్ కొరటాల తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూ బిజీగా ఉండగా.ఎన్టీఆర్ ఈ సినిమా కంటే ముందు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు.
తాజాగా తారక్ తన వెకేషన్ నుండి మరొక పోస్ట్ చేసారు.ఈయన కొన్ని వారాల క్రితం అమెరికా వెళ్ళాడు.
ఈ క్రమంలోనే ఈయన అక్కడ నుండి బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తుండగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.
తాజాగా ఎన్టీఆర్ న్యూయార్క్ లోని జునూన్ అనే ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి దీని గురించి ఒక పోస్ట్ చేసాడు.
అంతర్జాతీయ పర్యటనలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ అని జునూన్ రెస్టారెంట్ గురించి అమేజింగ్ అంటూ పొగుడుతూ అక్కడ రెస్టారెంట్ సిబ్బందితో ఫోజులిచ్చిన ఫోటోను షేర్ చేసాడు.ఈ ఫొటోలో స్టైలిష్ లుక్ లో తారక్ ఆకట్టు కుంటున్నాడు.
తారక్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కొరటాల సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.చూడాలి ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ముగిస్తారో.