విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీలేఖ, అప్పలరాజు అనే ఇద్దరు చిట్టీల పేరుతో మహిళలకు టోకరా వేసినట్లు సమాచారం.కాగా శ్రీలేఖ ఎస్ఎస్ఆర్ పేటలో వాలంటీర్ గా పని చేస్తుంది.సుమారు రూ.2 కోట్లకు టోకరా వేసారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







