అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi kapoor ) ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా కాలం అయింది.బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సినిమా లు ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి.
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈమె దాదాపుగా పది సినిమా లు , సిరీస్ లు చేసింది.కానీ ఏ ఒక్కటి కూడా ఈమెకు సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు.
చాలా సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి అనే విషయం తెల్సిందే.
ఎన్ని సినిమా లు చేసినా కూడా దక్కని సక్సెస్ ‘దేవర’ సినిమా( Devara movie ) తో రాబోతుంది అంటూ జాన్వీ కపూర్ చాలా నమ్మకంగా ఉంది.ఎన్టీఆర్( NTR ) హీరో గా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్ నటిస్తున్న కారణంగా ఆమె కెరీర్ కి యూటర్న్ అన్నట్లుగా నిలువబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో జాన్వీ కపూర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోయిన్ గా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కి తోడు రెండు మూడు సక్సెస్ లు దక్కితే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీ కపూర్( Janhvi kapoor ) ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమా( Devara movie ) హిట్ అయితే ఎలాంటి అనుమానం అక్కర్లేకుండా టాలీవుడ్ లో వరుసగా సినిమా లు చేసే అవకాశాలు ఉన్నాయి.బాలీవుడ్ లో ఎన్ని సినిమా లు చేసినా కూడా దక్కని సక్సెస్ దేవర తో వస్తే టాలీవుడ్ ను ఆమె ఎలా వదిలేస్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి బాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ లో కూడా జాన్వీ కపూర్ సినిమా లు చేస్తుంది.
కానీ దేవర హిట్ అయితే ఆమె టాలీవుడ్ హీరోయిన్ గా ఎక్కువగా సినిమా లు చేయాలని భావించే అవకాశాలు ఉన్నాయి.