చిన్న పాపకు పెళ్లి వద్దని చెప్పానన్న జగపతి.. ఆ పెళ్లితో లైఫ్ క్రాష్ అంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి, పిల్లలు అనే విషయాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.విలక్షణ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు ఎలాంటి పాత్రలో అయినా సులువుగా ఒదిగిపోతారు.

 Jagapati Babu Shocking Comments About Marriage Details Here Goes Viral , Jagapat-TeluguStop.com

జగపతిబాబు నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.తన అస్తుల గురించి జగపతి స్పందిస్తూ తన ఆస్తులు ఎక్కడికీ పోలేదని అన్నారు.

ఆస్తి ఏ విధంగా పోయిందనే విషయం నాకు కూడా తెలియదని ఆయన కామెంట్లు చేశారు.నన్ను మోసం చేసిన వాళ్ల గురించి నేను ఆలోచించనని ఆయన తెలిపారు.

నేను ఎవరినీ బ్లేమ్ చేయనని 30 కోట్ల రూపాయలు ఉంటే సంతోషంగా బ్రతకొచ్చని నేను భావిస్తానని జగపతిబాబు అన్నారు.ఆస్తులు మిగల్చలేమని వ్యాపారం చేద్దామని అనుకున్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Jagapati Babu, Jagapatibabu-Movie

ఇది నా సామర్థ్యం అని ఈ విషయాన్ని పిల్లలకు కూడా చెప్పేశానని జగపతి బాబు పేర్కొన్నారు.గతేడాదికి 30 కోట్ల రూపాయలు సంపాదించానని అంతకంటే ఎక్కువ సంపాదన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో కోట్ల రూపాయలు ఉన్నా చాలామంది ప్రాణాలను కాపాడుకోలేకపోయారని జగపతి బాబు పేర్కొన్నారు.రెండు ఫోన్లను చేతిలో పట్టుకుని అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Jagapati Babu, Jagapatibabu-Movie

నా పిల్లలు నేను చెప్పింది వినాలనుకోవడం రైట్ కాదని కుటుంబానిక్ రెస్పెక్ట్ ఇవ్వాలని జగపతి బాబు తెలిపారు.రెండో పెళ్లి గురించి ఆలోచించనని రెండో పెళ్లి చేసుకుంటే జీవితం క్రాష్ అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.చిన్నపాపకు పెళ్లి చేసుకోవద్దని చెప్పానని జగపతిబాబు పేర్కొన్నారు.అందరు హీరోయిన్లను ఫ్రెండ్స్ లా భావిస్తానని అందరు హీరోయిన్లతో బాగుంటానని ఆయన అన్నారు.జగపతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube