జగన్ ధీమా బెడిసికొడితే ? 

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ముందుకు వెళుతున్న తీరు ఒకపక్క ప్రశంసలు కురిపిస్తూనే ఉండగా, మరోవైపు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణం అవుతోంది.అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు.

 Jagan, Ap Cm, Ysrcp, Tdp, Chandrababu, Ap Government, Ap Welfare Schemes, Janase-TeluguStop.com

పెద్ద ఎత్తున పథకాలను ప్రవేశపెట్టారు.ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ మేలు చేసే విధంగా జగన్ పథకాలకు రూపకల్పన చేశారు.

వీటిని అమలు చేయడం ఎంత కష్టమైనా జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఎప్పటికప్పుడు కొత్త అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు అయ్యే విధంగా చూస్తున్నారు.

ఇప్పటికీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై పూర్తిగా సంతృప్తి ఉందని, మళ్లీ తాము అధికారంలోకి వస్తామని జగన్ లో ధీమా స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే ఏ విషయాన్ని లెక్కచేయకుండా జగన్ ముందుకు వెళ్తున్నారు.

పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు బాధ్యత అధికారుల పైన పెట్టి ప్రజాప్రతినిధుల పాత్ర నామమాత్రం చేశారు.ఈ విధంగా అయినా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని జగన్ అభిప్రాయం.

అయితే కేవలం సంక్షేమ పథకాలు అమలు తప్ప,  పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోకపోవడం, రోడ్లు పూర్తిగా దెబ్బతినడం దీనిపైన జనసేన టిడిపి లు ఆందోళనలు చేస్తూ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పరపతిని తగ్గించడంతో పాటు,  తమ గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటం వంటి వ్యవహారాలు వైసిపికి ఇబ్బందికరంగా మారాయి.సంక్షేమ పథకాలు ఇంత భారీ స్థాయిలో అమలు చేసినా, వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి .కానీ ఏపీలో దానికి భిన్నమైన వాతావరణం నెలకొంది.

Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Telugu Polit

గత టీడీపీ ప్రభుత్వం లోనూ ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేసినా, ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలు అకౌంట్ లో పదివేలు చొప్పున సొమ్ములు జమ చేసినా, టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది.అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జగన్ స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చెరగని ముద్ర వేశారు.

అయితే రెండో సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడంతో టిడిపి ఓటు బ్యాంకు భారీగా చీలింది.

కాంగ్రెస్ రెండో సారి రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చింది.అయితే సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి అమలు చేసినా, బొటాబొటిగా విజయం దక్కడంతో,  ఎంతగా సంక్షేమ పథకాలను అమలు చేసినా, ప్రజలు మూడ్ ను బట్టి పార్టీల గెలుపు ఉంటుందనే విషయం స్పష్టమైంది.

ఇప్పుడు జగన్ విషయంలో అదే పరిస్థితిని పోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధిని సమాన స్థాయిలో జగన్ చేపడితేనే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.

కేవలం సంక్షేమ పథకాలను ఒక్కటే నమ్ముకుని అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే జగన్ ధీమా బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube