జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది.

 Supreme Court Opposes Jagan Sarkar Request On English Medium, Ap Cm Jagan, Supre-TeluguStop.com

నేడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగగా సుప్రీం కోర్టు ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.ఏపీలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ జీవో 81, 85లను అమలులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే.

అయితే హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేసింది.హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేయగా త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించి ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.సుప్రీం తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.జగన్ సర్కార్ తరపున సీనియర్ లాయర్ కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు.

జగన్ సర్కార్ జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

విద్యాహక్కు చట్టంలో సైతం మాతృభాషలో విద్యాబోధన జరగాలని పేర్కొనలేదని ఆయన తెలిపారు.జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ర్లకు నోటీసులు ఇస్తామని స్టే మాత్రం ఇవ్వబోమని తేల్చి చెప్పింది.14 రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు కేవియట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు గతంలో రాష్ట్రంలో 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube