ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలలో టెన్షన్ మొదలైంది.ఇక ఇప్పటికే అందరికంటే ముందుగా బిఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యరర్థులను ప్రకటించి ప్రచారాలు కూడా మొదలుపెట్టారు.
ఇక కాంగ్రెస్ కొంతమంది అభ్యర్థులను ప్రకటించి మరి కొంత మందిని పెండింగ్లో పెట్టింది.అయితే ఇప్పటివరకు ఎలాంటి అభ్యర్థులను ప్రకటించకుండా అయోమయంలో పడిపోయింది బిజెపి (BJP) పార్టీ మాత్రమే.
ఇక బిజెపికి తెలంగాణలో సరైన క్యాడర్ లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే.అయితే 40 మందితో బిజెపి మొదటి జాబితా రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొదటి జాబితాలో అభ్యర్థులు దాదాపు కన్ఫామ్ అయినట్లే అని తెలుస్తుంది.
అలాగే ఈ మొదటి జాబితాలో ఎక్కువ బీసీలకే సీట్లు కేటాయిస్తున్నాట్టు తెలుస్తోంది.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీసీలకు సీట్ కేటాయించి బీసీ ఓట్లన్నీ తమ వైపు మళ్ళించుకోవాలని బిజెపి పార్టీ ఆలోచిస్తుందట.ఇక గజ్వేల్, హుజురాబాద్ రెండు స్థానాల నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender) పోటీకి దిగుతున్నారు.
అలాగే కామారెడ్డిలో విజయశాంతి,( Vijayashanti ) కరీంనగర్ లో బండి సంజయ్,( Bandi Sanjay ) అంబర్పేట్ లో కిషన్ రెడ్డి, ( Kishan Reddy ) నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ వంటి వాళ్ల పేర్లు మొదటి లిస్టులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక మిగిలిన నియోజకవర్గంలో చాలావరకు కార్పొరేటర్లనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.అలాగే కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కి ఈసారి మునుగోడు కాకుండా ఎల్బీనగర్ టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మిని ఎన్నికల బరిలో దింపబోతున్నారట.
అలాగే బీసీలను ఆకర్షించడానికి హైదరాబాదులో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నట్టు కూడా సమాచారం.
అలాగే ఈనెల అయిపోయే లోపు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక బిజెపి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది.ఇప్పటికే సీఎం సీట్ పై ఇటు కిషన్ రెడ్డి, అటు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్ కూడా ఆశ పెట్టుకున్నారు.ఇక బిజెపి సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి సీఎం సీట్ ని బీసీలకు ఇవ్వాలని బిజెపి అధిష్టానం ఆలోచన చేస్తుందట.