ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఓ మైనర్ బాలిక నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఉండే మరో ఇంటర్ చదివే విద్యార్థి రిమోట్ కావాలంటూ ఇంటికి వచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో యాదగిరిగుట్ట మండలంలో ఓ గ్రామంలో 12 సంవత్సరాల కలిగినటువంటి బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.అయితే ఈ బాలిక నివాసం ఉన్నటువంటి పక్క ఇంటిలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలుడు నివాసం ఉంటున్నాడు.
అయితే ఈ బాలుడు బాలిక పై కన్నేశాడు.ఇందులో భాగంగా ఎలాగైనా బాలికను లొంగదీసుకోవాలని పలు ప్రయత్నాలు చేసేవాడు.
అయితే తాజాగా బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన బాలుడు బాలికను రిమోట్ కావాలంటూ ఆమె ఇంటికి వెళ్ళాడు .దీంతో రిమోట్ తెచ్చి ఇచ్చేందుకు బాలిక లోపలికి వెళ్లగా అతను కూడా ఆమెతో పాటు వెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.
అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అయితే బాలిక బోరున వినిపించడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు.పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా బాలిక భయపడుతూ తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి చెప్పింది.దీంతో వెంటనే తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయం గురించి ఫిర్యాదు నమోదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన టువంటి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇటువంటి పోలీసులు విచారణలో భాగంగా నిందితుడు కోసం గాలిస్తుండగా నిందితుడు గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.