మెగా ఇంటిలో త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) పెళ్లి జరగబోతున్న విషయం మనకు తెలిసిందే.నటి లావణ్య త్రిపాఠిని( Lavanya Tripati ) ప్రేమించి ఈయన ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇక వీరిద్దరూ మిస్టర్ సినిమా చేసే సమయంలో వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని ఇటలీ( Italy )లోనే బయట పెట్టడంతో ఎక్కడైతే తమ ప్రేమ చిగురించిందో అక్కడే పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నటువంటి వరుణ్ తేజ్ తమ పెళ్లిని ఇటలీలో చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇలా వీరి పెళ్లి వేడుకకు ఇటలీలోని టుస్కానీ నగరంలో బార్గో శాన్ ఫెలిస్ అనే రిసార్ట్ లో జరగబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి.
ఇలా ఇటలీలో తమ పెళ్లి వేడుకలకు వరుణ్ తేజ్ భారీగానే ఖర్చు చేస్తున్నారట అయితే కొడుకు పెళ్లి కోసం నాగబాబు ( Nagababu ).ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలుస్తోంది తన పెళ్లి వేడుక తనకు నచ్చిన విధంగా జరగాలన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ తన సొంత ఖర్చుతోనే ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారని మెగా కుటుంబ సభ్యులందరికీ( Mega Family ) ఇటలీకి తీసుకువెళ్లడం నుంచి మొదలుకొని అక్కడ ప్రతి ఒక్క వేడుకకు సంబంధించిన మొత్తం వరుణ్ తేజ్ భరిస్తున్నారని తెలుస్తోంది.ఈ రిసార్ట్ లో ఒకేసారి వెయ్యి మంది వరకు బస చేయవచ్చట.
అయితే వరుణ్ మాత్రం దాదాపు 30 రూముల వరకు ఈ రిసార్ట్ లో బుక్ చేశారని పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తున్నారని తెలుస్తోంది.అయితే వీరి వివాహం నవంబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తుంది.ఇప్పటివరకు పెళ్లి ఇటలీలో జరుగుతుందని తెలిసినప్పటికీ పెళ్లి తేదీని మాత్రం ప్రకటించలేదు.త్వరలోనే ఈ విషయం అధికారికంగా వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.