టాలీవుడ్ బంగార్రాజు నాగార్జున గురించి ఎవరికీ తెలియని నిజాలివే?

నేడు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పుట్టినరోజనే సంగతి తెలిసిందే.ప్రముఖ సినీ నటుడు ఏఎన్నార్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తక్కువ సమయంలోనే వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన నాగార్జున తన సినీ కెరీర్ లో ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Tollywood Star Hero Nagarjuna , 60 Years Age, Interestin-TeluguStop.com

1986 సంవత్సరంలో నాగార్జున నటించిన తొలి సినిమా విక్రమ్ విడుదలైంది.తన నటనతో జాతీయ చిత్ర పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను, నంది పురస్కారాలను నాగార్జున సొంతం చేసుకున్నారు.టాలీవుడ్ బంగార్రాజుగా పేరును సంపాదించుకున్న నాగార్జున మాస్ రోల్స్ తో పాటు క్లాస్ రోల్స్ ను కూడా అద్భుతంగా పోషించగలరు.

భక్తి సినిమాలతో సైతం నాగార్జున భారీ విజయాలను అందుకున్నారు.

నాగార్జున స్టార్ హీరో కావడంతో పాటు రియాలిటీ షో హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, అన్నపూర్ణ స్టూడియో అధినేతగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

నటుడిగా నాగార్జున తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీని తెచ్చుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో నాగ్ నటనపై విమర్శలు వ్యక్తమైనా నాగ్ మాత్రం నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూ రావడంతో పాటు తన యాక్టింగ్ తో విమర్శలకు చెక్ పెట్టారు.

Telugu Age, Nagarjuna, Tollywod-Movie

మణిరత్నం సినిమాతో యువతలో నాగ్ క్రేజ్ సంపాదించుకున్నారు.శివ సినిమాతో నాగ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నారు.మొదటి భార్య లక్ష్మీతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన నాగ్ ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు.ఆరు పదుల వయస్సులో కూడా ఫిట్ గా కనిపిస్తూ నాగ్ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఏఎన్నార్ తో కలిసి నటించిన హీరోయిన్లతో పాటు నాగచైతన్య నటించిన హీరోయిన్లతో కూడా నాగార్జున కలిసి నటించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube