నాగార్జునను ఆ హీరో ఒరేయ్ అని పిలుస్తాడా.. ఆ హీరోతో ఇంత అనుబంధం ఉందా?

స్టార్ హీరో నాగార్జున వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అయితే వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా నాగార్జున మాత్రం మన్మథుడు అని ఆయన ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.

 Interesting Facts About Hero Nagarjuna Personal Life Details Here Goes Viral , N-TeluguStop.com

నాగార్జున వెంకటేశ్ బంధువులు అనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునే స్థాయిలో అనుబంధం ఉందని సమాచారం.

వెంకటేష్ సోదరి లక్ష్మీ నాగార్జున మొదటి భార్య కాగా వేర్వేరు కారణాల వల్ల లక్ష్మీ నాగార్జున విడిపోయారు.లక్ష్మీ నాగార్జునల కొడుకు నాగచైతన్య అనే సంగతి తెలిసిందే.

అయితే లక్ష్మీ నాగార్జున విడిపోయినా వెంకటేష్ నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉందని సమాచారం అందుతోంది.మరోవైపు నాగార్జున 100వ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

నాగార్జున ఈ మధ్య కాలంలో ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సందర్భాలు లేవు.అయితే 100వ సినిమా మాత్రం తన సినీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగార్జున సైతం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బిగ్ బాస్ షో హోస్ట్ గా నాగ్ మంచి మార్కులు సాధిస్తున్నా ఆయన హోస్టింగ్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈరోజు బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది.రేవంత్ విజేతగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారని సమాచారం.డబ్బు ఆఫర్ చేసినా కీర్తి భట్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.రేవంత్ విజేతగా నిలిచారని తెలిసి ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.నాగార్జున బిగ్ బాస్7 కు హోస్ట్ గా వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube