టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జయప్రకాష్ రెడ్డి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.300కు పైగా సినిమాలలో నటించిన జయప్రకాష్ రెడ్డి తన నటనతో మంచి పేరును సొంతం చేసుకున్నారు.ఆయన మరణించి నేటికి రెండు సంవత్సరాలైంది.బాల్యం నుంచి జయప్రకాష్ రెడ్డికి సినిమాలంటే ఎంతో ఇష్టం కాగా ఆర్.నాగేశ్వరరావు అనే నటుడు చనిపోయిన సమయంలో జయప్రకాష్ రెడ్డి మూడురోజుల పాటు ఆహారం తినలేదు.
ప్రేమించుకుందాం రా సినిమాలోని విలన్ రోల్ తో జయప్రకాష్ రెడ్డి కెరీర్ మలుపు తిరిగింది.
విలన్ పాత్రలలో ఎంత అద్భుతంగా నటించగలరో కామెడీ పాత్రలలో సైతం అంతే అద్భుతంగా నటించి మెప్పించడం జయప్రకాష్ రెడ్డికి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు.ఏ డైరెక్టర్ అయినా జయప్రకాష్ రెడ్డి పనితీరులో పెద్దగా మార్పు ఉండేది కాదు.
డైరెక్టర్ల ప్రతిభ వల్లే తనకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కిందని పలు సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు.
కెరీర్ తొలినాళ్లలో పిల్లల చదువు కోసం ఐదేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.జయప్రకాష్ రెడ్డి నిక్ నేమ్ బాటసారి కాగా బీఈడీ చేసిన తర్వాత ఆయన టీచింగ్ పై ఆసక్తి చూపించారు.బ్రహ్మపుత్రుడు అనే సినిమాతో నటుడిగా దాసరి నారాయణరావు కెరీర్ మొదలైంది.
జయప్రకాష్ రెడ్డిని ఒరేయ్ అని పిలిచేంత చనువు ఉన్న కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కావడం గమనార్హం.
రాజకీయాల్లోకి సూట్ అవ్వనని భావించి జయప్రకాష్ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు.సెంటిమెంట్, సింపథీ క్యారెక్టర్లు ఆయనకు ఇష్టం కాగా అలాంటి పాత్రలు చేయలేదనే లోటు తీరకుండానే ఆయన చనిపోయారు.మరణించడానికి కొన్నిరోజుల ముందు కూడా ఆయన రవీంద్ర భారతిలో జరిగిన ఒక నాటకంలో ఆయన పాల్గొన్నారు.
జయప్రకాష్ రెడ్డి మృతి ఆయన అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.