అదిరిపోయే ఫీచర్ ను పరిచయం చేస్తున్న ఇంస్టాగ్రామ్..!

ప్రస్తుత కాలంలో అందరూ కూడా సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్ ను కూడా చాలామంది యూజర్లు ఫాలో అవుతున్నారు.

 Instagram Quick Share Feature For Smart Phone Users Details, Instagram, New Feat-TeluguStop.com

రోజురోజుకు ఇంస్టాగ్రామ్ ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోతు వస్తుంది.అలాగే ఇంస్టాగ్రామ్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను అలరించే క్రమంలో సరికొత్త ఫీచర్లను మనకు పరిచయం చేస్తూ వస్తుంది.

తాజాగా మరొక సరికొత్త ఫీచర్‌ తో ఇన్‌స్టాగ్రామ్ మన ముందుకు వచ్చింది.స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ‘క్విక్ షేర్’ అనే సరికొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తాజాగా విడుదల చేసింది.

మరి ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ క్విక్ షేర్ ఫీచర్ సహాయంతో యూజర్లు ఏదైనా ఫోటోను గాని, వీడియోను గాని లేదంటే రీల్స్‌ను తాము పంపాలి అనుకుంటున్న కాంటాక్ట్‌కి నేరుగా షేర్ చేసుకోవచ్చన్నమాట.

అయితే యూజర్లు ఈ ఫీచర్ ను ఎక్కడ చూడాలంటే మీ ఇంస్టాగ్రామ్ పోస్టుల కింద ఉన్న సెండ్ కీ లో ఈ ఫీచర్‌ మీకు కనిపిస్తుంది.ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది.మరి ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో చూడండి.

Telugu Ups, Share, Latest, Share Contacts, Smart Phone-Latest News - Telugu

ముందుగా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌ లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ను ఓపెన్ చేయండి.ఆ తర్వాత మీ ఫీడ్ నుంచి మీ ఫ్రెండ్స్‌ తో షేర్ చేయాలనుకుంటున్న పోస్ట్‌ను సెలెక్ట్ చేసుకుని దానిని ఓపెన్ చేయండి.ఆ తరువాత మీ పోస్ట్ కింద ఎడమ వైపున ఉండే సెండ్ ఐకాన్ ను నొక్కి పట్టుకోండి.ఈ కొత్త ఫీచర్ అప్డేట్‌ను మీ యాప్ లో ఉన్నట్లయితే మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన ప్రొఫైల్ ఫొటోలతో ఓ కొత్త పాపప్‌ కనిపిస్తుంది.

వాటిలో.మీరు ఎవరికయితే పోస్ట్‌ను పంపాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకొని, మీ సెలెక్టెడ్ డీపీపై స్లైడ్ చేసి వదిలేయండి.

వెంటనే ఆ పోస్ట్ డైరెక్ట్ గా మెసేజ్ ద్వారా మీరు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్‌కి సెండ్ అయిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube