వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికాలలో భారతీయ రాజకీయ నాయకులు కీలక స్థానాల్లో వున్నారు.
ఇప్పుడిప్పుడే ఇతర దేశాల్లోని రాజకీయాల్లోనూ భారతీయులు తమ ఉనికిని చాటుకుంటున్నారు.తాజాగా ఫ్రాన్స్‌లో భారత సంతతికి చెందిన మహిళ చరిత్ర సృష్టించింది.
జూన్ 19న జరిగిన ఫ్రాన్స్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రిస్కా థెవెనోట్ ఎన్నికయ్యారు.
ప్రిస్కా ముత్తాత దక్షిణ భారతదేశానికి చెందిన వారు.
వీరి కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం మారిషస్‌కు వలస వెళ్లింది.ఆమె తల్లి బాలసుబ్రమెన్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.
అల్సాస్ ప్రాంతంలోని స్ట్రాస్‌బర్గ్‌లో ప్రిస్కా జన్మించారు.స్టెయిన్స్‌లో, తర్వాత గ్రాండే ఎకోల్‌లో ఆమె చదువుకకున్నారు.
సామాజిక సేవ, పౌర చర్యలపై ప్రిస్కాకు తొలి నుంచి ఆసక్తి వుంది.ఈ క్రమంలోనే సివిల్ ఇంపాక్ట్ అసోసియేషన్‌ను స్థాపించారు.
రాజకీయాలపై ఆసక్తితో ఎల్ఆర్‌ఈఎం (లా రిపబ్లిక్ ఎన్ మార్చే) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ పార్టీలో చేరింది.అలా రాజకీయాలపై ప్రిస్కా అనుభవం సంపాదించింది.కొద్దికాలంలోనే ఎల్ఆర్ఈఎం అధికారిక ప్రతినిధి స్థాయికి చేరింది.2021 నుంచి Île-de-France ప్రాంతానికి ప్రాంతీయ ప్రతినిధిగా కూడా ఎన్నికైంది.ఎల్ఆర్ఈఎంకు స్వరంగా మారిన ప్రిస్కా.ప్రభుత్వ చర్యలను సమర్ధించడంలోనూ, వివరించడంలోనూ బాధ్యత తీసుకునేవారు.తరచుగా టీవీ, రేడియో, వార్తాపత్రికల్లో కనిపించేవారు.కోవిడ్ 19 సమయంలోనూ ప్రిస్కా కీలకపాత్ర పోషించారు.
ఇక.తాజా ఫ్రెంచ్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 8వ నియోజకవర్గమైన హౌట్స్ డీ సీన్ నుంచి ఎల్ఆర్ఈఎం పార్టీ అభ్యర్ధిగా 65.75 శాతం ఓట్లతో ఆమె విజయం సాధించారు. థెవెనోట్.
ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీలోని యువతకు రోల్ మోడల్‌గా మారారు.తాజా ఎన్నిక నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో వున్న భారత సంతతి యువకులు రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం వుంది.