సింగపూర్: వద్దన్న పని చేస్తూ.. పైగా అధికారులపై తిట్ల దండకం, భారత సంతతి వ్యక్తికి జైలు

వద్దన్న పని చేయడమే కాకుండా.అధికారులను అభ్యంతరకర పదాలతో దూషించిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ కోర్ట్ జైలు శిక్ష విధించింది.

 Indian-origin Man In Singapore Jailed For Abusing Service Workers , Pitambaran D-TeluguStop.com

వేరు వేరు సందర్భాలలో అధికారులు, సిబ్బందిపై నిందితుడు విద్వేష వ్యాఖ్యలను చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.పీతాంబరన్ దిలీప్ అనే 69 ఏళ్ల భారత సంతతి వ్యక్తి రెండు ఆరోపణల్లో నేరాన్ని అంగీకరించడంతో బుధవారం అతనికి న్యాయస్థానం ఆరు వారాల జైలు శిక్ష విధించింది.

ఒక వ్యక్తి జాతికి సంబంధించిన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచినట్లు దిలీప్ ఒప్పుకున్నాడు.

బుధవారం.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాన్ ఝీ హావో మాట్లాడుతూ.పీతాంబరన్ జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

సింగపూర్‌లో జాతుల మధ్య సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం వుందని తాన్ ఝీ వ్యాఖ్యానించారు.పీతాంబరన్ గతేడాది జూన్ 9న పబ్లిక్ హౌసింగ్ ఎస్టేట్‌లోని క్లెమెంటీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్లి డస్ట్‌బిన్‌లో ఉమ్మి వేసినట్లు కోర్టుకు తెలిపారు.

దీనిని గమనించిన ఓ స్వీపర్ విషయాన్ని లైబ్రరీ మేనేజ్‌మెంట్‌కు నివేదించాడు.లైబ్రరీ అధికారి కీత్ లిమ్ పీతాంబరన్‌ను ఈ విషయమై మందలించారు.

కోవిడ్ సమయంలో ఇలా డస్ట్‌బిన్‌లో ఉమ్మి వేయొద్దని సూచించారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దిలీప్.

లిమ్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు.

Telugu Clementipublic, Deputypublic, Indianorigin, Associatecheok, Singapore-Tel

ఈ ఘటన తర్వాత గతేడాది జూలై 22న మెరైన్ పరేడ్‌లోని పాలిక్లినిక్‌కి మందుల కోసం వెళ్లిన సమయంలోనూ పీతాంబరన్ ఇదే రకమైన చర్యకు పాల్పడ్డాడు.పేషెంట్ సర్వీస్ అసోసియేట్ చెయోక్ లే యెన్ అక్కడ హెల్త్ మానిటరింగ్ స్టేషన్‌ను నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో పీతాంబరన్ ముందుకు వచ్చి తన క్యూ టికెట్‌ను కౌంటర్‌పైకి విసిరి.

ఆమెను దూషించాడు.ఇవి అతని మొదటి తప్పులే కాదని.2005లోనూ నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.2017లో బస్సు డ్రైవర్‌పై దాడి చేసినందుకు పీతాంబరన్‌కు ఆరు వారాల జైలుశిక్ష కూడా పడిందని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube