అరబ్బు దేశాలలో యూఏఈ కి ప్రత్యేక స్థానం ఉంది.తమ దేశాభివృద్ధి లో భాగంగా ఎన్నో సంస్కరణలను యూఏఈ తీసుకువచ్చింది.
ముఖ్యంగా ప్రవాసులను తమ దేశం వైపు ఆకర్షించే క్రమంలో చేపట్టిన ఎన్నో మార్పులు ఫలితాలను ఇచ్చాయనే చెప్పాలి.అంతేకాదు ఇప్పటికీ యూఏఈ ప్రభుత్వం ప్రవాసులను ఆకర్షించేలా కీలక మార్పులు చేస్తోందట.
తాజాగా యూఏఈ సర్కార్ తమ దేశంలో ఉన్న నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.అదేంటంటే.
యూఎఈ తమ దేశంలో నిరుద్యోగుల కోసం నిరుద్యోగ బీమా పధకాన్ని ప్రవేశపెట్టనుంది.ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ నిరుద్యోగ బీమా పధకానికి యూఎఈ మంత్రి వర్గం ఆమోదం తెలుపడంతో అధికారిక ప్రకటన చేశారు.
ఈ బీమా ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం తమ దేశంలో ఆర్ధిక పోటీ పెరిగిపోవడంతో ప్రతిభ ఉన్న వారిని, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని యూఎఈ ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ వెల్లడించారు.అయితే,
ఈ బీమా యూఎఈ పౌరులకు అంటే స్థానికులకు మాత్రమే వర్తిస్తుందా లేదంటే వలస కార్మికులకు కూడా వరిస్తుందా అనే విషయాలని మాత్రం వివరంగా వెల్లడించలేదు ప్రభుత్వం.త్వరలో ఈ బీమా విధివిధానాలు వెల్లడవుతాయని అప్పటి వరకూ వేచి ఉండాల్సిందేనని అంటున్నారు నిపుణులు.ఇదిలాంటే ఈ నిరుద్యోగ బీమా వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే ఒక వేళ కార్మికులు ఎవరైనా ఏదేని కారణం వలన ఉద్యోగం కోల్పోతే కొంత కాలం వరకూ డబ్బును ఈ బీమా ద్వారా పొందవచ్చు.అంతేకాదు కార్మికులకు సామాజిక భద్రతను కూడా అందిస్తుందని అంటున్నారు నిపుణులు.