అగ్రరాజ్యంలో స్థిరపడాలనే కోరిక భారతీయులలో నానాటికి పెరుగుతోందని.ట్రంప్ వీసా నిభందనలు ఎన్ని అమలు చేసినా ఆ నిభందనలు ఎంత ఖటినంగా ఉన్నా సరే అమెరికా ప్రవేశపెట్టిన ఈబీ-5 వీసా ద్వారా అయినా సరే మాకు అమెరికా శాస్వత పౌరసత్వం ఉండాల్సిందేనని భారతీయులు పట్టుపడుతున్నారు.
దాంతో అనేకమంది ధనవంతులు …వ్యాపారవేత్తలు…పెద్దపెద్ద కంపెనీల్లో కీలకస్థానాల్లో పనిచేస్తున్న వలసజీవులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ పరిణామాలతో యూఎస్ ఈబీ-5.గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.గత మూడు దశాబ్ధాలుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈబీ-5 వీసా కోసం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 5 లక్షల డాలర్లను పెట్టుబడి పెట్టి కనీసం 10 మందికి ఉద్యోగం కల్పించగలిగితే చాలు…అయితే ఈ నిభందనలు సైతం మార్చాలని అసలు ఈ నిభందనలు తొలగించాలని ఎంతో మంది అమెరికన్లు చట్టసభ్యులు పట్టు పడుతున్నా సరే భారతీయుల దరఖాస్తులు ఏ మాత్రం తగ్గరం లేదని గణాంకాలు చెప్తున్నాయి.
‘ఏవీజీ అమెరికా’ అనే కంపెనీ ముఖ్య అధికారి ఆరోన్ హోక్ ఇంటర్వూలోమాట్లాడుతూ అమెరికాలో గ్రీన్ కార్డ్ పొంది శాశ్వతంగా ఉండిపోవాలని అనుకునే భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతోందని తెలిపారు… అమెరికా, చైనా మధ్య దాదాపు 95 శాతం పోటీ ఉండేది.కానీ ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో పరిస్థితి మారింది.“ఎల్‌సీఆర్ కేపిటలర్ పార్టనర్స్” సహఅధ్యక్షుడు షెర్మన్ బాల్డ్‌విన్ పేర్కొన్నారు.
గతేడాది ఈబీ-5 వీసా కోసం అందిన మొత్తం 10 వేల దరఖాస్తుల్లో 500 దరఖాస్తులు భారతీయులవే కావడం గమనార్హం.
.