ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా లో భారతీయ ఎన్నారైల సంఖ్యని వారు నిర్వహిస్తున్న కంపీన్ల కుదింపు విషయంలో అడ్డందుకు ఏర్పడేలా చేస్తున్న అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పై తిరుగుబాటు మొదలయ్యింది…దాదాపు వెయ్యి ఐటీ కంపెనీలు సంయుక్తంగా ఈ విధానంపై కోర్టుల్లో దావా వేశాయి.ఈ దావాలో మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేయాల్సిన హెచ్-1బీ వీసాలను అంతకంటే బహు తక్కువ కాలపరిమితికి ఆ విభాగం జారీ చేస్తోందని ఆ కంపెనీల ఆరోపణ.
“ఐటీ సెర్వ్ అలయన్స్” పేరిట ఓ బృందంగా ఏర్పడ్డ ఈ చిన్నా చితకా కంపెనీల్లో ఎక్కువ భాగం భారతీయులు నిర్వహిస్తున్నవే…అసలైతే హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేసి మరో మూడేళ్లపాటు పొడిగిస్తారు.ఇపుడు యూఎ్సఐసీఎస్ ఆ మూడేళ్ల కనీస పరమితిని కూడా తక్కువ చేసేసి కొద్ది నెలలకో, కొన్ని సార్లు కొద్ది రోజులకో కూడా హెచ్-1బీ వీసాలను అనుమతించేస్తోందని.
అయితే ఇలా చేయడం వలన ఇది చట్టానికి వక్రభాష్యం చెప్పడమేనని.ఇలా చేసే అధికారం ఇమిగ్రేషన్ విభాగానికి అసలు లేనే లేదని ఆ కంపెనీలు తమ దావాలో పేర్కొన్నాయి.కాల పరిమితి తగ్గించడం వల్ల అనేకమంది నిపుణులకు సైతం అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందని.మానసికంగా కూడా ధృడంగా ఉండే పరిస్థితిని కోల్పుతున్నామని తెలిపారు.