హాకీ స్టిక్‌తో ఇంటి కిటికీని బద్ధలుకొట్టిన 48 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి యూకే కోర్ట్ శిక్ష విధించింది.నిందితుడిని లిసెస్టర్‌లోని మార్స్‌టన్ రోడ్‌కు చెందిన జోతీందర్ సింగ్‌గా గుర్తించారు.
ఇతని నేరాలకు సంబంధించి 480 పౌండ్ల జరిమానా, బాధితులకు 192 పౌండ్ల నష్టపరిహారం, 85 పౌండ్ల కోర్ట్ ఖర్చులను చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.దీనితో పాటు అతను 22 నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించారు.
గతేడాది సెప్టెంబర్ 7న లీసెస్టెర్ సిటీ సెంటర్‌లోని డీ మోంట్‌ఫోర్ట్ హౌస్ వద్ద నో పార్కింగ్ ప్లేస్‌లో కారును నిలిపారంటూ జోతీందర్ సింగ్‌కు నోటీసు వచ్చింది.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతను హాకీ స్టిక్‌తో కిటికీని పగులగొట్టాడు.
కోర్టుకు అందిన నివేదిక ప్రకారం.డి మోంట్‌ఫోర్ట్ హౌస్‌లో నివాసం వుండే నిందితుడు రెసిడెంట్ల కార్ పార్కింగ్ ప్లేస్‌కి వెళ్లాడు.
అక్కడ తనకు కేటాయించిన స్థానంలో మరొకరి కారు పార్క్ చేసి వుండటంతో వేరొకరికి చెందిన ప్లేస్‌లో అతని కారును పార్క్ చేశాడు.
దీనిని గమనించిన సెక్యూరిటీ ఏజెంట్ జోతిందర్ సింగ్ కారుపై నో పార్కింగ్ ప్లేస్‌లో కారును పార్క్ చేయవద్దని హెచ్చరిస్తూ పేపర్‌ను అతికించాడు.దీంతో జోతిందర్ కోపం నషాళానికి అంటింది.వెంటనే తన ఫ్లాట్‌కి వెళ్లి హాకీ స్టిక్ తీసుకొచ్చి.
సెక్యూరిటీ గార్డ్ వుండే ఆఫీసు కిటికీని ధ్వంసం చేశాడు.దీని కారణంగా 2000 పౌండ్ల నష్టం జరిగిందని స్థానిక వార్తాసంస్థ లీసెస్టర్ షైర్ లైవ్ నివేదించింది.
ఈ చర్యతో డీ మోంట్‌ఫోర్ట్ హౌసింగ్ నుంచి జోతిందర్ సింగ్‌ను బహిష్కరించడంతో పాటు అతనిపై దావా వేశారు.కోర్ట్ ఆదేశాల ప్రకారం.జరిగిన నష్టానికి గాను 2000 పౌండ్లను అతను చెల్లించాడు.ఇతనిపై గతంలో 2004, 2010, 2011లలో మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన నేరాలు వున్నాయి.అలాగే 2011లో అతను డ్రైవింగ్ చేయకుండా నాలుగేళ్ల పాటు కోర్ట్ నిషేధం సైతం విధించింది.