నా పుస్తకం ఇస్తా చదువుకోండి..ట్రంప్ కి దిమ్మతిరిగే రిప్లై

అగ్ర రాజ్యం అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కి దిమ్మతిరిగే షాకింగ్ రిప్లై ఇచ్చింది భారత్ అస్సామీ బాలిక ఆస్తా శర్మ.నా పుస్థకాలుఇస్తాను చదువుకుంటారా అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 Indian Girls Response To Donald Trumps Tweet Goes Viral On Internet-TeluguStop.com

వాతావరణం, ఉష్ణోగ్రత ఒకటి కానే కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పాఠాలు కూడా చెప్తోంది.ఇంతకీ ఆబాలిక రిప్లై ఇచ్చేంతగా ట్రంప్ ఏమి చేశారంటే.

నవంబర్‌ 21న అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ రెండు డిగ్రీ లకి పడిపోయింది.దాంతో ఇంతటి చలి దెబ్బకు.ఇన్నాళ్లు భూతాపం కారణంగా భూమిపై జరిగిన నష్టమంతా ఒక్కసారిగా మటుమాయమైపోతుంది అంటూ ట్రంప్ తనదైన విచిత్ర ధోరణిలో ట్వీట్ చేశారు.దాంతో ఒక్క సారిగా ఆ ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ.18 సంవత్సరాల అమ్మాయి ఆస్తా సర్మా మరో ట్వీట్‌ చేసింది.“ట్రంప్‌ గారూ.

నేను మీ కంటే 54 సంవత్సరాలు చిన్నపిల్లని అయితే వెదర్ , క్లైమేట్ ఒక్కటి కావు అనే విషయం మీకు తెలియలేదా.

ఒక వేళ మీకు నిజంగానే తెలియకపోతే నేను రెండో తరగతిలో ఈ విషయాల గురించి తెలుసుకున్న ఎన్‌సైక్లోపీడియా పుస్తకాన్ని మీకు పంపిస్తా.

ఫొటోలతో, వర్ణనలతో సవివరంగా ఉంటుంది అంటూ ట్వీట్‌ చేసింది.దాంతో ఇప్పుడు ఆ బాలిక ట్వీట్ లో 23,000 లైకులు వచ్చాయి.

అంతేకాదు 5,500 మందికి పైగా ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube