మనుష్ కుమార్ అనే 44 ఏళ్ల భారతీయ అమెరికెన్ అమెరికాలో వ్యాపారవేత్త ఎప్పటి నుంచో తన వ్యపారా కార్యకలాపాలు అమెరికాలో ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు.ఇదిలాఉంటే సెప్టెంబర్ 17 ,2017 న అతడు తన ప్రియురాలితో అమెరికాలోని ఒక రెస్టారెంట్ కి వెళ్లి వాళ్ళు ఇద్దరు తాగే సలాడ్ లో ఆమె గర్భం పోయేలా మందు కలిపి ఇచ్చాడు అయితే ఈ విషయం తెలియక ఆ సలాడ్ తాగిన ఆమె కొన్ని రోజుల తరువాతా తన గర్భాన్ని పోగొట్టుకుంది.
అయితే తన గర్భం పోవడానికి కారణం తానూ తాగిన డ్రింక్ అని అనుమానం వచ్చిన ఆమె ఆ సలాడ్ ని కాలిఫోర్నియాలో టెస్ట్ కి పంపింది అక్కడి టెస్ట్ లో ఆ డ్రింక్ ఆమె గర్భం పోవడానికి కారణమని తేలడంతో ఆమె తన ప్రియుడిపై ఫిర్యాదు చేసింది.దాంతో అతడు 2007 లో అరెస్టు అయ్యాడు.ఆ తరువాత అతడు ఇండియా పారిపోయాడు.దాంతో 7 లక్షల డాలర్ల విలువైన బాండ్లు కోల్పోయాడు.
ఇదిలాఉంటే కొంత కాలానికి తనపై ఉన్న కేసుని పరిష్కరించుకోవడానికి అతడు అమెరికా వచ్చాడు.దాంతో జనవరి 2017 లోన్యూయార్క్ లో అరెస్టయ్యాడు…అయితే అతడు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో కోర్టుకు తెలిపాడు.
తనకి ఉన్న కుమారుడు చిన్నతనం నుంచీ దీర్ఘకాలిక జబ్బుతో బాదపడుతున్నాడని ఒక వేళ ఆమె గర్భం దాల్చి పిల్లాడు పుడితే ఎక్కడ మళ్ళీ ఎలాంటి జబ్బు ఉన్న శిశువు పుడుతుందో అనే భయంతో ఆ పని చేశానని తెలిపాడు…అయిన సరే తానూ తప్పు చేశాడు కాబట్టి అమెరికా కోర్టు అతడికి 22 ఏళ్ల జైలు శిక్షని విధిస్తూ తీర్పుని చెప్పింది.