విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా వసి గ్రామంలోనిరసనలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కడుబండి వద్దు.
జగన్ ముద్దు అంటూ పోస్టర్లు వెలిశాయి.కాగా ఈ పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కడుబండి ఎమ్మెల్సీ రఘురాజు వర్గీయులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యేనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ రఘురాజు వర్గీయులు ఎదురుదాడికి దిగారు.ఈ క్రమంలో నియోజకవర్గంలో విభేదాలు కొనసాగుతున్నాయి.