తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.భూములపై సర్వ హక్కులు మీకే ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామన్న కేసీఆర్ పైరవీలు, దళారుల పాత్ర లేకుండా ధరణి తెచ్చామని తెలిపారు.
అయితే ప్రజలకు మంచి చేసే ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న కేసీఆర్ ధరణి పోర్టల్ ను కాదు కాంగ్రెస్ నేతలనే బంగాళాఖాతంలో వేయాలని తెలిపారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ కష్టాలు తప్పవని చెప్పారు.భూములు ఒకరివి మరొకరి పేరుపై మారకూడదంటే కాంగ్రెస్ ను శిక్షించాలని తెలిపారు.