ఎన్ని అవమానాలు ఎదురైనా లక్ష్యంను చేధించాలి : మంత్రి ఆర్.కే.రోజా

నేను చదువుకున్న పద్మావతి డిగ్రీ కాలేజీ( Padmavati Degree College )లో చీఫ్ గెస్ట్ గా, ఒక మంత్రి హోదాలో రావడం నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు అని ఏపి పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా ( RK Roja ) తెలియజేశారు.మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఓ కార్యక్రమంకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

 I Will Never Forget Coming To The College Where I Studied As The Chief Guest In-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… తాను చదువుకున్న కళాశాలకి ముఖ్య అతిధిగా, అందులోనూ ఒక మంత్రిగా హాజరు కావడం తన జీవితంలో మరిచి పోలేని రోజుగా మిగిలి పోతుందని, మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక్కడ జరిగిన సంఘటనలు, మేము చేసిన అల్లరి పనులు, మేము చేసిన చిలిపి పనులన్నీ గుర్తు కొచ్చాయన్నారు.అలాంటి అల్లరి పనులు మేమేనా చేసిందని అనిపిస్తూ ఉంటాయని, నేను కళాశాలలో అడుగు పెట్టిన సందర్భంగా ఇక్కడ విద్యార్దులు నన్ను స్వాగతం పలికిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని, ఆ విధానం తనకు బాగా నచ్చిందని, ఆడపిల్లల కేరింతలకి తన కంటిలో ఆనందబాష్పాలు వచ్చాయని తెలిపారు.

నేను ఎక్కడైతే స్టూడెంట్ గా చదువుకున్న కళాశాలకే మంత్రి హోదాలో వచ్చి మీరు కూడా ఇలా ఎదగాలని, టీచర్లు చెప్పిన వన్ని విని లక్ష్యం వైపు అడుగులు వేయాలని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు.లక్ష్యం వైపు అడుగులు వేసే సమయంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అరోపణలు చేసినా లక్ష్యం వైపు వెళ్ళాలని, మనం మనస్సాక్షికి, దేవుడికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలని, సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవని, సక్సెస్ సాధిస్తేనే అత్తవారింట్లో అయినా, పుట్టింట్లోనైనా, సమాజంలోనైనా మహిళలకు గౌరవం లభిస్తుందని, కాబట్టి ఆ సక్సెస్ మనం సాధించే వరకు నిద్ర పోకూడదని ఆడపిల్లలు అందరికీ చెప్పడం పిలుపు నివ్వడం జరిగిందన్నారు.

ఆడపిల్లల కాలేజ్ కాబట్టి భయం, మొహమాటం ఉండవని, అందరూ కూడా స్వేచ్ఛగా, ధైర్యంగా ఉంటారని, అందుకే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారని, ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన అందరూ సొసైటీలో మంచి హోదాలో ఉన్నారని, అదే ఈ కాలేజీ స్పెషాలిటీ అని ఆమె తెలియజేశారు.నేను చదువుకున్న రోజుల్లో ఇక్కడి ఉపాధ్యాయులందరినీ గుర్తుకు చేసుకున్నానని, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని, నా కాలేజీకి మళ్లీ నేను అడుగు పెట్టిన శుభ సందర్భంలో రెట్టింపు ఉత్సాహంతో 2024లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడి చేసి, మహిళా పక్షపాతంగా నిరూపిస్తానంటూ మంత్రి ఆర్‌కే.

రోజా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube