పోలీసులకు చిక్కిన నకిలీ ఖాకీలు..!

తెలంగాణ లో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు.మన నకిలీ డిఎస్పీ స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు.

 Hyderabad Police Captured Three Fake Sot Police, Hyderabad Police, Captured, Thr-TeluguStop.com

బేదిరింపులకు పాల్పడుతూ, డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయటపడింది.

హైదరాబాదులోని కె పి హెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసుల బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  SOT పోలీసుల పేరుతో గత కొంత కలంగా స్థానికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఓ బ్యూటీ పార్లర్ సిబ్బందిని బెదిరించడంతో వీరు గుట్టురట్టయంది.
  ఈనెల 11వ తేదీన కే పీ హె చ్ బీ లోని 6వ పేజీలోని ఓ బ్యూటీ పార్లర్ లోకి ఎంటర్ అయ్యారు.

గంప సాయి హర్ష, అభిలాష్ గౌడ్, రంగా భాను ప్రసాద్ గౌడ్ లు తమకు తాము SOT పోలీసులమని చెప్పుకొన్నారు.డబ్బులు కోసం డిమాండ్ చేశారు అయితే వీరిపై అనుమానం వచ్చింది బ్యూటీ పార్లర్ మేనేజర్ కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభిషేక్ గౌడ్, భాను ప్రసాద్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ పోలీస్ సాయి హర్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే డిఎస్పి అవతారమెత్తిన ఫేక్ పోలీస్ నెల్లూరు స్వామిని రిమాండ్  తరలించారు పోలీసులు.నెల్లూరు స్వామి ఎలాగైనా ఆ డ్రెస్ లోనే ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా SI  కాకపోయేసరికి నకిలీ పోలీస్ అవతారమెత్తాడు.

Telugu Abhilash Goud, Captured, Fade Dsp, Hyderabad, Sot-Telugu Crime News(క

అందుకోసం అచ్చం పోలీసు మాదిరిగానే ఖాకీ యూనిఫాం కుట్టించుకున్నాడు.తర్వాత పెట్రోలింగ్  చేస్తున్న పోలీసులకు తాను కూడా పోలీసులు అన్నట్టగా బిల్డప్ ఇస్తూ రోడ్డుపై హల్చల్ చేశాడు.కాకుండా ఉద్యోగం ఇప్పిస్తానని కొందరు అమాయకుల దగ్గర నుంచి కోట్ల వరకు వసూలు చేశాడు నెల్లూరు స్వామి.

ఇప్పుడు మరో ముగ్గురు నకిలీ పోలీస్ పట్టుబట్టడంతో ఇంకా ఎంత మంది నకిలీ పోలీస్ లు ఉన్నారో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube