కువైట్ ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది వలస కార్మికులు పనిచేస్తున్న దేశం.కార్మికులుగా వెళ్ళే ప్రతీ ఒక్కరూ కువైట్ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.
ఇలా ఏళ్ళ కాలంగా అత్యధికంగా వలస కార్మికులు కువైట్ లో స్థిరపడి పోయారు అంతేకాదు కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కూడా ప్రవాసుల అధిక శాతం నియమించబడ్డారు.ఈ క్రమంలోనే కువైట్ తమ దేశంలో ఉన్న ప్రవాసుల సంఖ్య ను తగ్గించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కువైటైజేషన్ పాలసీను తెరపైకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం కువైటైజేషన్ లో భాగంగా ప్రవాసుల ను తలగిస్తూ వచ్చిన కువైట్ ప్రభుత్వం కువైట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులపై కూడా వేటు వేస్తోంది.ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తున్న 49 మంది ప్రవాసులపై వేటు వేసింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది.కువైటైజేషన్ ఓ భాగంగానే ఈ 49 మందిపై వేటు వేశామని ప్రకటించింది.
వీరి స్థానంలో స్థానిక కువైటీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది.
కువైటైజేషన్ నిభందన ప్రకారం ఐదేళ్ళలో కువైట్ లో ఉంటున్న ప్రవాస ఉద్యోగుల స్థానంలో కువైటీలను భర్తీ చేయాలి.
ఈ క్రమలోనే ప్రతీ ఏడాది కొంత శాతం ప్రభుత్వ, ప్రవైటు రంగంలో ఉంటున్న ప్రవాసులపై వేటు వేసేందుకు సిద్దమయ్యింది.ఇదిలాఉంటే తాజాగా తొలగించబడిన 49 మంది ప్రవాసులలో సుమారు ఏడుగురు 60 ఏళ్ళు పై బడిన వారు ఉన్నారని మిగిలిన వారు 40 -60 ఏళ్ళ లోపు వారేనని తెలిపింది.
అయితే కువైట్ తీసుకున్న ఈ నిర్ణయంతో కువైట్ లో ఉంటున్న ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో ఏళ్ళ నుంచీ కువైట్ లోనే ఉంటున్నామని తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోననే ఆందోళన తమలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.