గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై అధికార వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేసి దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపింస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆస్తులను కొల్లగొడుతుంటే ఆయన పార్టీ వాళ్లు పట్టణాలు, గ్రామాలను దోచుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ నేతలు దేవాలయాలను, విగ్రహాలను కూడా వదలడం లేదని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు.
అయితే ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ స్థానిక నేత వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో 25 కోట్ల రూపాయిల విలువైన మరకత వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆలయాల నుంచి దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో ఈ ఖరీదైన విగ్రహం ఒకటిగా గుర్తించారు.గతంలో ఆలయాలపై వందలాది దాడులకు పాల్పడింది అధికార వైఎస్‌ఆర్‌సీపీ గూండాలేనని టీడీపీ నేతలు అంటున్నారు.
ఒక వేళ ఓ చిన్న నాయకుడి ఇంట్లో 25 కోట్ల రూపాయల విగ్రహం, పెద్ద పెద్ద నాయకులు ఎత్తుకెళ్లిన పురాతన విగ్రహాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద, మధ్య తరహా ఆలయాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నగలు, విగ్రహాలు ఎత్తుకెళ్తున్నారనేది పబ్లిక్ టాక్.

ప్రస్తుత పాలనలో హిందూ దేవాలయాల ఆస్తులకు భద్రత కరువైందని భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.అంతర్వేది ఆలయ రథాన్ని దగ్ధం చేసిన నేరస్తులను ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుకోలేదని టీడీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు.విజయవాడలోని దుర్గగుడి వెండి సింహాలు అదృశ్యమైనా అక్రమార్కులను అరెస్టు చేయలేదని… రామతీర్థం ఆలయంలోని రామ విగ్రహం తలను నరికిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభత్వం పై విరుచుకుపడుతున్నారు .దొంగల పాలనలో దేవాలయాల ఆస్తులకే కాదు దేవుడి విగ్రహాలకు కూడా భద్రత లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.కేంద్ర బలగాలు మరియు న్యాయ బృందాల నుండి రక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఆడిట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని… లేకుంటే దేవాలయాల వద్ద మిగిలే నగలు కూడా వైసీపీ నేతల పిల్లల మెడలో ఆభరణాలుగా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.







