ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ అమలులోకి తీసుకు రావడం జరిగింది.దీంతో రాష్ట్రంలో ఇక నుండి ఉదయం ఐదు నుండే బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చు.
అంతమాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హోటల్లు, తినుబండారాల దుకాణాలు, రెస్టారెంట్లు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.ఇటీవల రాష్ట్రంలో ఉన్న హోటల్ పరిశ్రమకు చెందిన సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎలాంటి కోవిడ్ నిషేధాజ్ఞలు… హోటల్ మరియు రెస్టారెంట్ లలో అమలులో లేనందున 2022 జూన్ 14వ తేదీ నుండి రాత్రి 12 వరకు ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు స్పష్టం చేయడం జరిగింది.రాష్ట్రంలో భారం రెస్టారెంట్ మినహా ఇతర హోటళ్ళు మరియు రెస్టారెంట్ లో ఉదయం 5 నుండి రాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు అనే దిశగా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
దుకాణాలు సంస్థల చట్టం 1988 సెక్షన్ 7 ప్రకారం అనుసరిస్తూ ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.







