కేవలం రూ.99కే ఏకంగా ఓ బ్యాంక్‌ను కొనేశారు తెలుసా?

వినడానికి విడ్డురంగా వున్నా మీరు విన్నది నిజమే.అవును, బ్రిటిష్ మల్టీ నేషనల్ యూనివర్సల్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి హెచ్ఎస్‌బీసీ (HSBC) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

 Hsbc Acquires Silicon Valley Bank For One Pound Details, Svb, Bank, Account, 99r-TeluguStop.com

విషయం ఏమంటే, సంపద పరంగా యూరప్‌లోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న హెచ్ఎస్‌బీసీ తాజాగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన SVB (సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌)కు(Silicon Valley Bank) చెందిన యూకే సబ్సిడరీని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే ఇక్కడ డీల్ విలువ తెలిస్తే అవాక్కవుతారు.

నిజం, కేవలం ఒకే ఒక్క పౌండ్‌కు(One Pound) హెచ్ఎస్‌బీసీ.సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడరీని కొనుగోలు చేసిందంటే మీరు నమ్ముతారా? మన దేశీ కరెన్సీలో చెప్పుకుంటే ఒక్క పౌండ్ విలువ రూ.99కు సమానం అని అందరికీ తెలిసినదే.అంటే కేవలం రూ.99కే హెచ్ఎస్‌బీసీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ యూకే సబ్సిడరీని కొనేసిందని చెప్పుకోవచ్చు.ఈ విషయమై హెచ్ఎస్‌బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ మాట్లాడుతూ.

ఎక్సలెంట్ స్ట్రాటజిక్ సెన్స్‌తో ఈ డీల్ జరిగిందని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకే బిజినెస్‌ను, కమర్షియల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీ బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ వారికి ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పుకొచ్చారు.అదేవిధంగా టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో వేగంగా డెవలప్ అవుతున్న సంస్థలకు మెరుగైన సర్వీసులు కూడా అందిస్తామని అన్నారు.

ఇకపోతే ప్రభుత్వం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ అనేవి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే విక్రయానికి అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.ఇక మార్చి 10 నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకేకు 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు ఉన్నాయి.అలాగే 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు కూడా ఉన్నాయి.కాగా ఈ డీల్‌లో ఎస్‌వీబీ యూకే పేరెంట్ కంపెనీ ఆస్తులు, అప్పులు మిహాయింపు ఇవ్వడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube