తమిళ నటుడు నంబియార్ జీవితం సాగిందిలా...

ఎంఎన్ నంబియార్ అలియాస్ మంజేరి నారాయణ్ 1919 మార్చి 7న కేరళలోని కన్నూర్ సమీపంలోని కందక్కై గ్రామంలో జన్మించారు.అతని తండ్రి కేలు నంబియార్, అతని చిన్నతనంలోనే చనిపోయాడు.

 How Is The Life Of Tamil Actor Nambiar Details, Tamil Actor Nambiar, Mn Nambiar,-TeluguStop.com

అక్క పెళ్లయ్యాక ఎం.ఎన్.నంబియార్ వారితో ఉండేందుకు ఊటీ చేరుకున్నాడు.అక్కడే చదువు పూర్తి చేశాడు.13 సంవత్సరాల వయస్సులోనే అతనికి నటనపై ఆసక్తి కలగడంతో అతను నవాబ్ రాజమాణికం నాటక బృందంలో చేరాడు.నిజానికి అతని భాష మలయాళీ, కానీ అతను తమిళం నేర్చుకున్న తర్వాత తమిళ భాషా నాటకాలలో నటించాడు.నాటకాల్లో పురుషులే కాకుండా స్త్రీల పాత్రను కూడా తన శైలితో పోషించాడు.

అమ్మకి 2 రూపాయలు పంపేవాడు.

అతను బాయ్స్ కంపెనీ నాటకానికి ప్రతిఫలంగా తన మొదటి జీతం 3 రూపాయలు అందుకున్నాడు.ఇందులో ఒక రూపాయి తన వద్ద ఉంచుకుని మిగిలిన రెండు రూపాయలను తల్లికి పంపించాడు.

ఎంఎన్ నంబియార్‌కు అవసరాలు చాలా తక్కువ.అతని తిండి బాధ్యత డ్రామా కంపెనీ చూసుకునేది.

అలాంటి పరిస్థితుల్లో నంబియార్ డబ్బు పొదుపు చేసేవాడు.అతనికి ఎప్పుడూ డబ్బు అవసరం లేదు.

కాబట్టి అతను తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని తన కుటుంబ సభ్యులకు పంపేవాడు.

Telugu Bhakta Ramadasu, Kollywood, Mn Nambiar, Mnnambiar, Nambiar, Tamil Nambiar

16 ఏళ్ల వయసులో తమిళ చిత్రసీమలోకి అడుగు…

నంబియార్ నటనలో నిపుణత సాధించాడు.1935లో కేవలం 16 సంవత్సరాల వయస్సులో అతను తొలుత భక్త రామదాసును చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడు.ఈ చిత్రం హిందీ మరియు తమిళంలో రీమేక్ అయ్యింది.

ఇందులో నంబియార్, టి.కె.సంపంగి కమెడియన్లుగా గుర్తింపుపొందారు.ఈ చిత్రంలో అతను 2-3 పాత్రలు పోషించాడు.

ఇందుకు అతనికి 75 రూపాయలు ముట్టాయి.అతని భార్య రుక్మిణి.

ఆమె నంబియార్ కంటే 11 సంవత్సరాలు చిన్నది.ఆమె తన కుటుంబాన్ని ఎంతగానో చక్కగా చూసేది.

నంబియార్ ఎప్పుడూ ఇంటి బయట ఆహారం తినలేదు.ఇంటా ఆహారమే తినేవారు.అది కూడా భార్య చేతులతో చేసినది మాత్రమే తినేవారు.1946లో పెళ్లయ్యాక భార్య లేకుండా భోజనం చేసిన రోజు అతని జీవితంలో లేదు.వారికి ముగ్గురు పిల్లలు. వారిలో కుమారులు సుకుమార్, మోహన్, కుమార్తె స్నేహ.

Telugu Bhakta Ramadasu, Kollywood, Mn Nambiar, Mnnambiar, Nambiar, Tamil Nambiar

నంబియార్‌కు 89 ఏళ్లు వచ్చేసరికి అనారోగ్య సమస్యలు వేధించసాగాయి.యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా, మునుపటిలా కోలుకోలేకపోయాడు.దీంతో ఎప్పుడూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే నంబియార్ దాదాపు తినడం, తాగడం మానేశాడు.ఒకరోజు కొడుకు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మీరు బాగా తినమని ఒత్తిడి చేసేవారు.అప్పుడు మేము తినేవారం అని అన్నారు.

దీనికి నంబియార్ నవ్వుతూ తన కొడుకు వైపు చూసి, నాకు 90 ఏళ్లు వచ్చాయి.అది చాలు అని బదులిచ్చారు.ఇది అతని మరణానికి రెండు రోజుల ముందు జరిగింది.ఎప్పుడు ఎం.ఎన్.నంబియార్ షూటింగ్‌కి వెళ్లినా, షూటింగ్ అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చేవాడు.ఇతర తారలను సెట్స్‌లో మాత్రమే కలుసుకునేవారు.నంబియార్ కుటుంబంతో గడపడానినే ఇష్టపడేవారు.ప్రతి సంవత్సరం నంబియార్ ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా లేదా ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మే నెలలో షూటింగ్‌లకు దూరంగా ఉండేవారు.అతను తన కుటుంబంతో గడిపేందుకు ఈ నెలను కేటాయించేవాడు.

ఆ సమయంలో నంబియార్ కుటుంబం అంతా ఊటీలో గడిపేది.నంబియార్ 2008 నవంబరు 17న చెన్నైలో కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube