Karthik Subbaraj : జూనియర్ ఆర్టిస్ట్ ను ఫ్యాన్ ఇండియా స్టార్ ని చేసిన షార్ట్ ఫిలిం డైరెక్టర్

కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj ) అనే వ్యక్తి ఐటి కంపెనీ లో ఉద్యోగం కోల్పోయి ఎలా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసాడు, ఎలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తాను డైరెక్షన్ నేర్చుకున్నాడు అనే విషయాల పై ఇదివరకు మాట్లాడుకున్నాం.ఇక ఈ రోజు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎలా హీరోగా, ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అనే విషయం గురించి తెలుసుకుందాం.

 How Director Karthik Subbaraju Made Vijay Sethupathi As Hero-TeluguStop.com

ఇంతకు ఆ జూనియర్ ఆర్టిస్ట్ పేరు చెప్పలేదు కదా.అతడు మరెవరో కాదు ప్రస్తుతం అన్ని భాషల్లో నటిస్తున్న విజయ్ సేతుపతి.సినిమాల్లోకి రావడానికి విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎలా అతడికి మొదటి సినిమ అవకాశం దక్కిందో ఇదివరకే కొన్ని ఆర్టికల్స్ లో తెలుసుకున్నాం.

-Movie

అయితే విజయ్ సేతుపతి సినిమా ఇండస్ట్రీ ని కాకుండా ఒక యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే వ్యక్తిని నమ్ముకొని ఎలా హిట్ కొట్టాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.అప్పుడప్పుడే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది.తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సైతం ఐటి లో ఉద్యోగం మానేసి షార్ట్ ఫిలిం చేస్తున్నాడు.

ఆ టైం లో విజయ్ సేతుపతి కొన్ని సినిమాల్లో బ్యాగ్రౌండ్ లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.ఒక్క డైలాగ్ ఉన్న సినిమా పడటం కూడా కష్టం గా ఉంది.

ఇక లాభం లేదు.ఇలా అయితే ఈ జన్మలో హీరో కాదు కదా విలన్ కూడా అవ్వలేను అని షార్ట్ ఫిలిమ్స్( Short films ) అయితే అన్ని రోల్స్ చేయచ్చు అని అంత వెతుకుతున్నాడు.

ఆ టైంలోనే సోషల్ మీడియాలో కార్తీక్ సుబ్బరాజు గురించి తెలిసి వెళ్లి కలిసాడు.

-Movie

అప్పుడు మొదలయింది విజయ్ సేతుపతికి అదృష్టం.అలాగని ఊరికే ఏమి హీరో అయిపోలేదు.కార్తీక్ మరియు విజయ్ సేతుపతి చాల కష్టపడ్డారు.

ఎంత అంటే ఒక రోజంతా సముద్రం మధ్యలో ఒక బోట్ లో అలాగే ఉన్నాడు విజయ్. ఆలా నీర్ ( Ala neer )అనే షార్ట్ ఫిలిం తీశారు.

వీరిద్దరూ గురించి తమిళ ఇండస్ట్రీ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టింది.కనిపించిన వారికల్లా జిగర్తాండ కథ చెప్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు.

అలాగే తన షార్ట్ ఫిలిమ్స్ చూపిస్తూ విజయ్ సైతం అవకాశాల కోసం ట్రై చేసాడు.ఇద్దరికి అన్ని వర్క్ అవుట్ అయ్యాయి.

ఈ రోజు కార్తీక్ తమిళ్ లో సూపర్ స్టార్ డైరెక్టర్ కాగా, విజయ్ సేతుపతి గురించి చెప్పాల్సిన పని లేదు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube