వైరల్ వీడియో: ఓయ్.. పంత్ ఇలా చేస్తే ఎలా..?!

రసవత్తరంగా సాగే క్రికెట్ మ్యాచ్ లలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే భలే అనిపిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే ఈ సీరియస్ ఆటలో అప్పుడప్పుడు చోటుచేసుకునే సరదా పనులు వీక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

 How Can Pant Do This Viral Latest, Viral News, Viral Video, Social Media, Pant-TeluguStop.com

అయితే తాజాగా ఇండియన్ క్రికెటర్ చేసిన ఒక పని ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ప్రస్తుతం భారత్‌-ఇంగ్లండ్‌ క్రికెట్ టీముల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విధితమే.

అయితే ఇటీవల లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు నాల్గవ రోజు గేమ్ లో ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది.

ఈ ఆటలో రహానే, పంత్‌ ఇంగ్లాండ్ బౌలర్లకు ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు.

అయితే ఒకానొక సమయంలో రహానే బ్యాటింగ్‌ చేస్తుండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో పంత్‌ ఉన్నారు.ఆ టైంలో అండర్సన్ బౌలింగ్ వేస్తున్నారు.ఈ క్రమంలోనే పంత్‌ వెనక్కి తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.దీంతో క్రికెటర్లతో పాటు ప్రేక్షకులు కూడా స్టన్ అయ్యారు.

ఒక రియల్ మ్యాచ్ లో.అదీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పంత్‌ ఇలా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.కొందరు మాత్రం పంత్‌ చేష్టలు చూసి నవ్వేశారు.

అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షమై వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రహానే క్రీజు నుంచి పక్కకు ఎందుకు వెళ్లలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కొందరు మాత్రం పంత్‌ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ నుంచే అండర్సన్‌ బంతిని కొట్టేందుకు సిద్ధమై ఉంటారంటూ సెటైర్లు పేల్చుతున్నారు.ఏది ఏమైనా ఇంగ్లండ్‌ సిరీస్‌లో పంత్ పేలవమైన ఆట ప్రదర్శనతో పూర్తిగా ఫెయిల్ అయ్యారు.

అయితే గత ఏడాదిలో ఆయన పర్ఫామెన్స్ చూసి ఈసారి టీమిండియా మంచి అవకాశాన్ని ప్రసాదించింది కానీ అతను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube