కొన్ని సినిమాలు కొంతమంది హీరోస్ తీస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు.పైగా పెద్ద హీరోలు పెద్ద ప్రాజెక్టులు పెద్ద బడ్జెట్ తో సినిమా చేయడం వల్ల మార్కెట్ కూడా పెద్దగానే ఉంటుంది.
పెద్ద బడ్జెట్ సినిమా చిన్న హీరోతో తీయడం నిర్మాతకు రిస్క్ కాబట్టే పెద్ద హీరోలను సంప్రదిస్తూ ఉంటారు.స్టార్ హీరోలు( Star Heroes ) చేస్తే తప్ప హ్యాండిల్ చేయలేని స్క్రిప్స్ కొన్ని ఉంటాయి.
కొన్నిసార్లు కంటెంట్ బాగుంటే హీరోతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది.అయితే హీరో ఇమేజ్ కారణంగా మార్కెట్లో డబ్బులు రికవరీ అవ్వాలంటే పెద్ద హీరోలతో మాత్రమే వర్కౌట్ అవుతుందని నమ్మే నిర్మాతలు, దర్శకులు ఉన్నారు.
అయితే ఆ మ్యాజిక్ అన్ని సార్లు వర్కౌట్ కాదు.
ముక్కు మొహం తెలియని హీరోలు ఎంత మంచి సినిమా చేసిన చూడాలని ఇంట్రెస్ట్ ప్రేక్షకులలో కలగదు.దర్శక నిర్మాతలు సైతం తమ స్టోరీ బాగుంటే దానికి ఒక పెద్ద హీరో అయితే బాగుంటుందని అనుకుంటారు.అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే అంజి ( Anji Movie ) చిత్రాన్నే తీసుకోవాలి.
ఈ సినిమా చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వచ్చి కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆగుతూ మళ్లీ తీస్తూ దాదాపు చాలా విరామం తీసుకుని విడుదలై ప్రేక్షకులను చాలా డిసప్పాయింట్ చేసింది.
సినిమాలోని గ్రాఫిక్స్ ( Graphics ) చాలా అడ్వాన్సుడ్ గా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలయ్యారు.వాటిని అర్థం చేసుకునే పరిస్థితి ఆ టైంలో అప్పటి ప్రేక్షకులకు లేదు.అంజి చిత్రం ఇప్పుడు కనుక విడుదలై ఉండి ఉంటే ఖచ్చితంగా అందరూ బాగా రిసీవ్ చేసుకుని ఉండేవారు.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ మొదట వెంకటేష్ తో( Venkatesh ) తీయాలని అనుకున్నారట.వెంకటేష్ కి సైతం ఈ స్క్రిప్టు బాగా నచ్చిందట.
కానీ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి( Producer Shyam Prasad Reddy ) మాత్రం ఏదో ఒక కారణం చేత చిరంజీవిని కలిసి సందర్భంలో తాను తీయబోయే అంజి సినిమా కథ చెప్పారట.
చిరంజీవిది కూడా ఈ కథ చాలా బాగా నచ్చడంతో తానే తీస్తానని ముందుకు వచ్చాడట.దాంతో నిర్మాత చిరంజీవి మార్కెట్ వెంకటేష్ కన్నా చాలా పెద్దది కాబట్టి తాను పెట్టిన డబ్బులు రికవరీ అవుతాయని ఉద్దేశంతో వెంకటేష్ తో తప్పించి చిరంజీవితో ఈ చిత్రాన్ని తీశారట.వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబినేషన్లో అప్పటికే దేవి పుత్రుడు( Devi Puthrudu ) సినిమా కూడా వచ్చి పరాజయం పాలయ్యింది.
అలా అంజి చిత్రం వెంకటేష్ చేతి నుంచి చిరంజీవి చేతికి వెళ్ళింది.