యంగ్ టైగర్ సినిమాకు హాలీవుడ్ టచ్.. పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ( Junior NTR, Hrithik Roshan ) కాంబినేషన్ లో వార్2 టైటిల్ తో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ , టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి.

 Hollywood Touch For Young Tiger Ntr War2 Movie Details Here Goes Viral In Socia-TeluguStop.com

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా మరో హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తైందంటే ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా జరుగుతుందో సులువుగానే అర్థమవుతుంది.

అయితే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ కూడా ఇచ్చేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ ( Ayan Mukherjee ) ప్లాన్ చేశారని భోగట్టా.ఫాస్ట్ ఎక్స్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సినిమాల కోసం పని చేసిన స్పిరో రజాటోస్ ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పని చేయనున్నారని తెలుస్తోంది.

Telugu Ayan Mukherjee, Hollywood Touch, Hollywoodtouch, Hrithik Roshan, Ntr, War

వార్ ఫస్ట్ పార్ట్ ను మించేలా వార్2 సినిమాలో( War2 movie ) యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.హృతిక్, తారక్ మధ్య యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ సినిమాకు పని చేస్తున్న యూనిట్ సభ్యుల నుంచి సమాచారం వినిపిస్తోంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్( Yash Raj Films banner ) పై ఈ సినిమా తెరకెక్కుతోంది.2025 సంవత్సరం ఆగష్టు 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Ayan Mukherjee, Hollywood Touch, Hollywoodtouch, Hrithik Roshan, Ntr, War

ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారని భోగట్టా.హృతిక్, తారక్ కాంబో మూవీ కావడంతో అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ సినిమా అంచనాలను మించి మెప్పించే ఛాన్స్ ఉంది.తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే వార్2 సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాతో హృతిక్, తారక్ పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube