యంగ్ టైగర్ సినిమాకు హాలీవుడ్ టచ్.. పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ( Junior NTR, Hrithik Roshan ) కాంబినేషన్ లో వార్2 టైటిల్ తో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ , టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా మరో హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తైందంటే ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా జరుగుతుందో సులువుగానే అర్థమవుతుంది.

అయితే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ కూడా ఇచ్చేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ ( Ayan Mukherjee ) ప్లాన్ చేశారని భోగట్టా.

ఫాస్ట్ ఎక్స్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సినిమాల కోసం పని చేసిన స్పిరో రజాటోస్ ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పని చేయనున్నారని తెలుస్తోంది.

"""/" / వార్ ఫస్ట్ పార్ట్ ను మించేలా వార్2 సినిమాలో( War2 Movie ) యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హృతిక్, తారక్ మధ్య యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ సినిమాకు పని చేస్తున్న యూనిట్ సభ్యుల నుంచి సమాచారం వినిపిస్తోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్( Yash Raj Films Banner ) పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

2025 సంవత్సరం ఆగష్టు 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

"""/" / ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారని భోగట్టా.

హృతిక్, తారక్ కాంబో మూవీ కావడంతో అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ సినిమా అంచనాలను మించి మెప్పించే ఛాన్స్ ఉంది.

తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే వార్2 సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాతో హృతిక్, తారక్ పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతారేమో చూడాలి.

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!