తాజాగా ఓ యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది.అవును నిజమే మీరు విన్నది.
అమ్మాయి ఏంటి.దేవుని పెళ్లి చేసుకోవడం ఏంటి.
అని అనుకుంటున్నారా.? అవునండి తాజాగా మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రంలోని గ్వాలియర్లో యువతి సాక్షాత్తు శ్రీకృష్ణుని వివాహం చేసుకుంది.ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్ముని పెళ్లి చేసుకుంది.సదరు మహిళ తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకుంది.
గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివాసం ఉంటున్న శివాని పరిహారకు( Shivani Parihara ) తన చిన్నప్పటినుండి కృష్ణుడు అంటే మితమైన భక్తి, ప్రేమ.
సదరు మహిళ వయసు పెరిగే కొద్దీ దేవుడిపై మరింత ప్రేమ పెరుగుతూ వచ్చింది.అది ఎంతలా అంటే చివరికి దేవుడిని పెళ్లి చేసుకునే అంతగా.ఈ నేపథ్యంలో సదరు మహిళ వారి తల్లితండ్రులను ఒప్పించి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది.
అంతేకాదు పెళ్లి జరిగిన తర్వాత వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం.అమ్మాయిని అప్పగింతల కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.ఇక వివాహ కార్యక్రమం ముగిసిన తర్వాత వరుడు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బృందావన్ నుండి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
అక్కడి స్థానిక దేవాలయంలో వేదమంత్రాలు సాక్షిగా ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన వివాహ ప్రమాణ పత్రం కూడా సదరు అధికారులు అందజేశారు.పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుని విగ్రహం( Lord Krishna ) తీసుకొని శివాని బృందావనానికి బయలు దేరి వెళ్ళింది.
ఇక తన పూర్తి జీవితాన్ని కేవలం రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణుడికి సేవలు చేస్తూ ఉండబోతున్నట్లు ఆవిడ తెలిపింది.ఈ విషయం సంబంధించి శివాని తల్లితండ్రులు మాట్లాడుతూ.
మొదట తన కుమార్తె పెళ్లి విషయంలో తాము ఎన్నో ఆలోచనలు చేశామని., కాకపోతే తమ కూతురి పట్టుదల చూసి చివరికి తాము ఈ పెళ్లికి అంగీకరించినట్లు వారు చెప్పుకొచ్చారు.